రాష్ట్రంలో నీటి సమస్యే కాదు కరెంట్ సమస్య కూడా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఒక్క నీటి సమస్యే కాదు కరెంట్ సమస్య కూడా నడుస్తుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేసిఆర్ అంటేనే కాలువలు, చెరువులు నదులు ఆయన లేకపోతే నీటి ఎద్దడి వస్తుందని కేవలం 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించిందన్నారు. ప్రభుత్వ చేతగాని తనం వల్ల వచ్చిన కరువుగా దీనిని గుర్తించాలన్నారు. మన…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దారిపొడవునా జై జగన్ నినాదాలతో యాత్ర మార్మోగుతోంది.
రంగారెడ్డిలో దారుణం.. ఇద్దరిపై పిచ్చికుక్కల దాడి..! రంగారెడ్డి జిల్లాలో పిచ్చికుక్కల స్వైర విహారం రోజు రోజుకూ ఎక్కువగా మారుతుంది. మంచాల మండలంలో చిన్నపిల్లలపై, మహిళలపై విచక్షణా రహితంగా కుక్కలు దాడి చేస్తున్నాయి. ఉదయం నడుకుంటూ పోతున్న ఓ మహిళ, ఓ బాలుడి పై దాడి చేసి వారిపై కండలు పీక్కుతిన్నాయి. వారిద్దరూ గట్టిగా కేకలు వేయడంతో అక్కడకు స్థానికులు చేరుకుని కుక్కను తరుముతున్న కుక్కలు దాడి మాత్రం ఆపలేదు. ఓ బాలుడి చేతికి, మహిళలకు కాళ్ల కండరాలను…
బస్సు యాత్ర సందర్భంగా పలు పార్టీలకు చెందిన అసంతృప్త నేతలు వైసీపీలో చేరుతున్నారు. తాజాగా.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన కో-ఆర్డినేటర్‌గా ఉన్న పితాని బాలకృష్ణ.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బస్సుయాత్ర 3వ రోజుకు చేరుకుంది. ఎమ్మిగనూరులో భారీగా నిర్వహిస్తోన్న 'మేమంతా సిద్ధం' సభకు.. లక్షలాదిగా జనం తరలివచ్చారు. నేడు దిగ్విజయంగా సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగింది.
అనంతపురం జిల్లాలోని రాప్తాడు ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచారం ఓ ఫ్లాప్ షో అని పేర్కొన్నారు. జగన్ ఓ పెద్ద సైకో అయితే.. రాప్తాడులో పిల్ల సైకో ఉన్నాడు.. ఫ్యాన్ కు ఓటేసిన ప్రజలు అదే ఫ్యానుకు ఉరేసుకునే పరిస్థితికి వచ్చారు అని ఆయన ఆరోపించారు.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంత సిద్ధం బస్సు యాత్రకు ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన వస్తోంది అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ప్రజలు తిరస్కరించారు.. ఉమ్మడి రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని చంద్ర బాబు దోచుకున్నారు అని ఆరోపించారు.
కవితను అరెస్టు చేయడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు.. తెచ్చుకున్న తెలంగాణకు న్యాయం చేయకుండా కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రం బాగుపడింది అని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. అందుకే వారి కుటుంబానికి తగిలే దెబ్బలు ప్రజలందరూ స్వీకరిస్తున్నారు. కవితను అరెస్టు చేయడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు అని తెలిపారు. అలాగే, కాళేశ్వరం, మేడిగడ్డ విషయంలో కూడా బీజేపీ ప్రభుత్వం మాట్లాడకుండా ఉంది అంటే ఆరోజు మెగా వాళ్ళు కోట్ల రూపాయలు ఇస్తున్నారన్నారు. ఇక, వరంగల్ నగరంలో గతంలో…
ఎల్లుండి (బుధవారం) నుంచి సీఎం వైఎస్ జగన్ బస్సుయాత్ర చేపట్టనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 'మేమంతా సిద్ధం' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహించనున్నారు. ఈ బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి మొదలై ఇచ్చాపురం వరకు సాగనుంది. ఈ నెల 27న ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఘాట్ వద్ద ప్రార్ధనలు చేసిన అనంతరం మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలో ఏ చెట్టును అడిగినా.. పుట్టను అడిగినా సైకిల్ మాటే వినపడుతోందని.. కూటమి గెలుపు మాటే వినపడుతోందని చంద్రబాబు చెప్పుకుచ్చారు. కుప్పంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు.