1. నేడు కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగనుంది. ఉదయం 11 గంటలకు రాజ్యసభలో ప్రమాణ స్వీకారోత్సవం. యూపీ నుంచి రాజ్యసభకు టీబీజేపీ నేత డా.లక్ష్మణ్ ఎన్నికయ్యారు. అయితే ఆయనచే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనివార్య కారణాలతో నలుగురు సభ్యుల గైర్హాజరు. అయితే.. నిర్మాలా సీతారామన్, పియూష్ గోయల్, 9 రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
2. నేడు ఏపీ వ్యాప్తంగా రైతు దినోత్సవం నిర్వహించనున్నారు. ఏపీ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం. జిల్లా, ఆర్బీకే స్థాయిలో వేడుకలు నిర్వహించనున్నారు.
3. నేడు సెప్టెంబర్ నెల వసతి కోటా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఆన్‌లైన్ వసతి టికెట్లును విడుదల చేయనుంది టీటీడీ.
4. నేడు గుంటూరు వేదికగా వైసీపీ ప్లీనరీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నేడు వైఎస్సార్ జయంతి సందర్భంగా సీఎం జగన్ ఉదయం 8 గంటలకు ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్‌కు చేరుకొని నివాళులు అర్పించనున్నారు.
5. నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. తెలంగాణలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం చురుగ్గా కదులుతోంది. రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
6. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,850లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,110 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 62,400లుగా ఉంది.