Draupadi Murmu: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకి జగన్ సపోర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఏపీలో ఘన స్వాగతంతో పాటు ఘన సత్కారం లభించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలంటూ ఏపీలోని ప్రజా ప్రతినిధులను కోరేందుకు ఏపీకి వచ్చిన ముర్ముకు గన్నవరం ఎయిర్ పోర్టులో వైసీపీ, బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ముర్ముకు సతీసమేతంగా సీఎం జగన్ స్వాగతం పలికారు. అనంతరం ఆమెను చీర సారెతో వారు సత్కరించారు. వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని ఆమెకు అందించారు. అనంతరం ముర్ముతో కలిసి ఆమె కారులోనే జగన్ వైసీపీ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లారు. వైసీపీ ప్రజా ప్రతినిధులను స్వయంగా జగన్… ముర్ముకు పరిచయం చేశారు.
ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైయస్.జగన్‌ను కలిసి… తేనీటి విందులో పాల్గొన్నారు ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి శ్రీమతి ద్రౌపది ముర్ము. ఆమెకు వేదఆశీర్వచనం ఇచ్చి, ప్రసాదాలు అందించారు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్ధానం వేదపండితులు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.ప్రధాని నరేంద్ర మోడీ తరఫున సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైఎస్సార్‌సీపీ మద్దతు పలకడం సంతోషం. అందరితో చర్చించాకే ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ప్రకటించామన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి గిరిజన మహిళకు అవకాశం లభించింది. పార్టీలకు అతీతంగా ముర్ముకు అందరం మద్దతు పలకాలన్నారు.అంతకుముందు జగన్ మాట్లాడారు. సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిప ప్రభుత్వం వైసీపీ అన్నారు.
Also Read
- OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
- Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
- AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
- CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులంతా ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని, ఓటేయాలని సీఎం జగన్ కోరారు. ‘‘రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి గిరిజన మహిళకు అవకాశం లభించింది. మొదటి నుంచి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపిస్తూ వస్తోంది. కాబట్టి, సహృదయంతో పార్టీ నిర్ణయాన్ని బలపర్చాల’ని పార్టీ ప్రతినిధులను సీఎం జగన్ కోరారు.
అంతేకాదు ఒక్క ఓటు కూడా వృథా కాకూడదని, జులై 18న మాక్ పోలింగ్ కూడా నిర్వహిస్తామని, మాక్‌పోలింగ్‌లో పాల్గొన్న తర్వాతే ఓటింగ్‌కు వెళ్లాలని సభ్యులకు సూచించారు. ఎంపీల తరపున విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలు బాధ్యతలు తీసుకుంటారని, అలాగే విప్‌లు, మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ స్పష్టం చేశారు.ద్రౌపది ముర్ముని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై వుందన్నారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఓటు వేయాలని, మాక్ పోలింగ్ లో పాల్గొనాలని జగన్ సూచించారు. తనకు మద్దతు తెలిపిన తెలుగు ప్రజలకు ద్రౌపది ముర్ము ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు కవులను, స్వాతంత్ర్య సమరయోధులను ఆమె గుర్తుచేసుకున్నారు. జై వందేమాతరం, జై ఆంధ్రప్రదేశ్ అన్నారు ద్రౌపది ముర్ము.
తాజావార్తలు
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
ట్రెండింగ్
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!