కొనకనమిట్ల మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో మంచి జరుగుతోందని గీతాంజలి చెప్పడమే ఆమె చేసిన పాపమని.. తన మనుషులతో సోషల్‌మీడియాలో గీతాంజలిని వేధించి చంపారని ఆయన ఆరోపించారు. 20 జెలొసిల్ ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గని కడుపుమంట చంద్రబాబులో కనిపిస్తోందన్నారు.
ప్రకాశం జిల్లా కొనకనమిట్ల 'మేమంతా సిద్ధం' బహిరంగ సభలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొదిలిలో బిందువు బిందువు చేరి సిందువు అయినట్లు జనసంద్రం కనిపిస్తుందని.. మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతుగా ప్రతీ సిద్ధం అంటున్నారన్నారు. ప్రజల అజెండాతో మనం, జెండాలు జత కట్టి వాళ్లు వస్తున్నారని విమర్శించారు.
ప్రొద్దుటూరు సభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం దద్దరిల్లింది. ప్రొద్దుటూరులో ఈ రోజు ఒక మహా సముద్రం కనిపిస్తుంది అంటూ ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇంతటి మహా సైన్యం మధ్య మన ప్రజా జైత్ర యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా తల ఎత్తుకుని రెపరెపలాడుతుందన్నారు.
ఒక్క రూపాయి లంచం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, వాలంటీర్లు రాబోయే రోజుల్లో లీడర్లు కాబోతున్నారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 58 నెలలు అలసిపోకుండా పేదలకు సేవ చేశామన్నారు. మరో రెండు నెలలు పేదవారి బతుకులు మార్చేందుకు యుద్ధానికి సిద్ధమా అంటూ సీఎం పేర్కొన్నారు. లం
ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక విధానాన్ని ప్రారంభించింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో 'ఫ్యామిలీ డాక్టర్' విధానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు.
విపక్ష సభ్యుల సస్పెన్షన్లు, హాట్ హాట్ డిస్కషన్లు.. వాయిదాల మీద వాయిదాలతో చివరాఖరికి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ నెల 7న సభా సమావేశాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఏపీ వార్షిక బడ్జెట్ 2022-23కి రాష్ట్ర అసెంబ్లీ ఇవాళ ఆమోదం తెలిపింది. అనంతరం, అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్త