ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగి ఏడాది పూర్తయిపోయింది. ఈ టైంలో అమలైన హామీలు, జరిగిన పనుల గురించి విస్తృత చర్చ మొదలైంది రాష్ట్రంలో. ఆ చర్చ దిశగానే తెలుగుదేశం పార్టీ కూడా కార్యక్రమాలు రూపొందించుకుంటోంది. అయితే... రాజకీయంగా చూసుకుంటే... ఇది కూటమి పార్టీల మధ్య బాగా సున్నితమైన అంశంగా మారుతున్న సౌండ్ వినిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ హామీలిచ్చింది టీడీపీ. అధికారంలోకి వచ్చాక వాటి అమలుపై దృష్టి సారించింది.
సీబీఎన్ 14 కాదు.. సీబీఎన్ 95 ఇక్కడ.. తప్పుచేస్తే తోక కట్ చేస్తా అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కుప్పంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉండే ల్యాండ్ రికార్డులు మొత్తం మార్చేశారు.. 22ఏ కిందా ప్రజల భూములను పెట్టి వైసీపీ నేతలు వేధించారు.. భూములను దోచుకోవడమే లక్ష్యంగా వైసీపీ నేతలు పనులు చేశారు అని…
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా... ఇంటింటికి ప్రజా ప్రతినిధులు, పార్టీల నేతలు వెళ్ళి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించాలని నిర్ణయించారు.దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహించింది. తమ ఏడాది ఘనతను జనంలోకి దూకుడుగా తీసుకువెళ్ళాలని డిసైడయ్యారు టీడీపీ లీడర్స్.
గోదావరి పుష్కరాలను మహా కుంభమేళా తరహాలో నిర్వహిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. వరుసగా మూడోసారి గోదావరి పుష్కరాలను ముఖ్యమంత్రిగా నిర్వహించే బాధ్యత నాకేదెక్కిందని హర్షం వెలిబుచ్చారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం దేవుడు తనకే కల్పించాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
Telangana CM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. 90 టీఎంసీలు పట్టిసీమకు తీసుకెళ్లారు.. దాంట్లో మాకు 45 టీఎంసీలు రావాలని డిమాండ్ చేశారు. ఇక, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకి నీళ్ళ కేటాయింపులు కావాలి అంటే ఇవ్వడం లేదు.. ఏపీ ప్రభుత్వం అభ్యంతరం ఎందుకు చెప్తున్నారు అని ప్రశ్నించారు.
నేను రౌడీలతో పోరాటం చేస్తున్నా.. రాష్ట్రంలో వికాసం.. విధ్వంసం మధ్య యుద్ధం జరుగుతుందన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పర్యటనలో.. పెన్షన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు.. ఆ తర్వాత ప్రజా వేదికపై మాట్లాడుతూ.. .వికాసం.. విధ్వంసం మధ్య యుద్ధం జరుగుతుందన్నారు.. ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అయ్యింది.. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ విజయాలను ఇంటింటికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం.
కంటతడి పెట్టిస్తున్న నవ వధువు చివరి సందేశం.. తండ్రితో బాధను పంచుకున్న కుమార్తె తమిళనాడులో నవ వధువు రిధన్య అర్ధాంతరంగా తనువు చాలించింది. ఇక ఆత్మహత్యకు ముందు తన తండ్రికి పంపించిన వాట్సాప్ రికార్డులు కంటతడి పెట్టిస్తున్నాయి. తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే.. సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాల్సిన చోట వేధింపులు మొదలయ్యాయి. అటు తల్లిదండ్రులను బాధపెట్టలేక.. ఇటు మనసు చంపుకోలేక తనకు తానుగా మరణశాసానాన్ని రాసుకుంది. చనిపోయే ముందు అల్లారు…
విశ్వంభరపై అనుమానాలు.. చిరు తేల్చాల్సిందే.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. బింబిసార డైరెక్టర్ వశిష్టతో చేస్తున్న ఈ సోషియో ఫాంటసీ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. కానీ టీజర్ వచ్చాక కొన్ని నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. వీఎఫ్ ఎక్స్ మరీ వీక్ గా ఉందంటూ ప్రచారాలు జరిగాయి. కానీ తర్వాత వచ్చిన సాంగ్స్ తో వాటిని కవర్ చేసేశారు మూవీ టీమ్. అయితే రిలీజ్ ఎప్పుడు అనేదానిపైనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే…
ఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం. ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన భేటీ. సంగారెడ్డి : నేడు సిగాచి పరిశ్రమకి సీఎం రేవంత్ రెడ్డి. పటాన్ చెరు ధ్రువ ఆస్పత్రిలో పరిశ్రమలో గాయపడి చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించనున్న ముఖ్యమంత్రి. అనంతరం ప్రమాద స్థలిని పరిశీలించనున్న సీఎం రేవంత్. నేడు తెలంగాణ గ్రూప్-1 పిటిషన్లపై విచారణ. TGPSC నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష సమాధాన పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిపోయింది. కానీ... అంతకు చాలా రోజుల ముందు నుంచే... తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు మీద దృష్టి పెట్టారట సీఎం చంద్రబాబు. శాసనసభ్యుల ప్రతి మూవ్‌మెంట్‌కు సంబంధించిన నివేదికలు తెప్పించుకున్నట్టు తెలుస్తోంది.