టిడ్కో ఇళ్లపై లబ్ధిదారులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మాట్లాడుతూ.. లబ్ధిదారులకు దీపావళి నాటికి టిడ్కో ఇళ్లు అందజేస్తామని వెల్లడించారు.. గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలు వచ్చినా.. ఉన్నా.. ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తున్నాం అని తెలిపారు.
ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు శుక్రవారం తెల్లవారుజామున అనకాపల్లి జిల్లా కసింకోట మండలం ఉగ్గినపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ యాక్సిడెంట్ సంబంధించి పోలీసుల కథనం ప్రకారం.. కడిపిలంక నుంచి పూలు కొనుగోలు చేసి, అనకాపల్లికి చెందిన ఇద్దరు మహిళలు స్వగ్రామానికి బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న బొలెరో…
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మూడు జిల్లాల్లో కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన ఉదయం 10.30 గంటలకు విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్ హోటల్లో నిర్వహించనున్న జీఎఫ్ఎస్టీ టూరిజం కాంక్లేవ్‌లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక రంగ అభివృద్ధిపై అధికారులు, పరిశ్రమ ప్రతినిధులతో సీఎం మాట్లాడనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు గుంటూరు బయలుదేరి చంద్రబాబు, సాయంత్రం 3 గంటలకు ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజీలో నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్…
గుంటూరు : నేడు గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. గుంటూరు రూరల్ మండలం చౌడవరం ఆర్.వి.ఆర్.అండ్ జే.సి. ఇంజనీరింగ్ కాలేజీలో పోలీసు శాఖ ఏఐ హ్యాక్ థాన్ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడుపాలెంలో జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పనితీరును పరిశీలించనున్న చంద్రబాబు. నేడు విశాఖలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్, CS పర్యటన. ఇవాళ సాగర్‌నగర్‌లో EPDCL సూపర్ ఈసీబీసీ భవనం ప్రారంభం. స్కాడా భవనం సందర్శించనున్న మంత్రి గొట్టిపాటి…
గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిస్తున్నా.. ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ పోవడమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.. నేను యువతకు ఒకటే చెబుతున్నా. ఎన్నికలకు ముందు కూడా చెప్పాను. రౌడీల తోక కత్తిరిస్తానని అన్నాను. రాయలసీమలో ముఠా కక్షలు. కుటుంబాలకు కుటుంబాలను చంపే పరిస్థితి. రాయలసీమలో ముఠాకక్షలను పూర్తిగా అణిచివేశాం. మతసామరస్యాన్ని కాపాడుతాం... విద్వేషాలు రెచ్చగొట్టే…
25 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో స్పేస్ పాలసీ రూపొందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. దీని ద్వారా ప్రత్యక్షంగా 5 వేలు, పరోక్షంగా 30 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.. లేపాక్షి, తిరుపతిలో స్పేస్ సిటీల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తోంది ప్రభుత్వం.. 25 నుంచి 45 శాతం వరకు పెట్టుబడి రాయితీలు కూడా కల్పించనుంది.. విద్యార్ధులను భాగస్వాములు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. ఆకర్షణీయంగా ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0 ఉండాలని ఆదేశించారు…
సీఎం చంద్రబాబు నాయుడు సర్కార్ మరోసారి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందంటూ ఎక్స్‌లో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేదని, అడ్డగోలుగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీఎండీసీ ద్వారా నిన్న కూడా బాండ్లు జారీ చేశారని, రూ.5526 కోట్లను బాండ్ల జారీ ద్వారా అప్పులు చేశారన్నారు. రానున్న రోజుల్లో మరలా ఏపీఎండీసీ ద్వారా అప్పులు చేయటానికి సిద్దమయ్యారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈ డబ్బంతా ఎవరి…
నేడు కొణిదెల గ్రామానికి పవన్ కళ్యాణ్.. సొంత నిధులతో..! ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామానికి వెళ్లనున్నారు. కొణిదెల గ్రామంలో పవన్ తన సొంత నిధులతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. భూమి పూజ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యేలతో పాటు నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య పాల్గొననున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కొణిదెల గ్రామ పర్యటన నేపథ్యంలో పోలీసు అధికారులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. పవన్…
రిషబ్ పంత్‌కు కెరీర్ ఉత్తమ ర్యాంకు! ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పురోగతి సాధించాడు. ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పంత్ కెరీర్ ఉత్తమ ర్యాంకు అందుకున్నాడు. లీడ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో రెండు సెంచరీలు చేయడంతో ఒక ర్యాంకు మెరుగుపరుచుకుని.. ఏడో స్థానంలో నిలిచాడు. లీడ్స్ టెస్ట్‌లో పంత్ మొదటి ఇన్నింగ్స్‌లో 134, రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశాడు. లీడ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో…
నేడు గుంటూరులో సీఎం చంద్రబాబు పర్యటన. యాంటీ నార్కోటిక్ డే కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం. మధ్యాహ్నం 3 గంటలకు ర్యాలీలో పాల్గొననున్న చంద్రబాబు. రెండు రోజుల పాటు గుంటూరులోనే చంద్రబాబు పర్యటన. నేడు సాయంత్రం 4 గంటలకు శిల్పకళా వేదికకు సీఎం రేవంత్. యాంటీ నార్కోటిక్ డే కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం. ప్రత్యేక అతిథిగా హాజరుకానున్న హీరో రామ్‌చరణ్. రాజమండ్రిలో కేంద్రమంత్రి షెకావత్, పవన్ పర్యటన. నేడు అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు…