ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి ఎమ్మెల్యేలకు, అందులోనూ ప్రత్యేకించి టీడీపీ వాళ్ళకు ఏమైందని హాట్ హాట్‌గా చర్చించుకుంటున్నాయి జిల్లా రాజకీయవర్గాలు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉండడమే కాకుండా కనీసం వైసిపి విమర్శలకు సైతం కౌంటర్ ఇవ్వాలన్న స్పృహ కూడా ఎందుకు ఉండటం లేదని పార్టీ కేడరే మాట్లాడుకుంటున్న పరిస్థితి.
గత ప్రభుత్వం రీ సర్వే సరైన పద్ధతిలో చేయలేదు.. కేవలం ఫొటోల పిచ్చితో రీసర్వే చేశారు అని విమర్శించారు ఏపీ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్.. అయితే, పారదర్శకంగా భూముల రీ సర్వే జరుగుతుంది.. హక్కులకు భంగం లేకుండా భూ సర్వే జరుగుతుంది.. ఆగస్టు 15న కొత్త పాస్ బుక్స్ ఇస్తామని వెల్లడించారు..
మామిడి రైతులకు అండగా నిలిచింది కూటమి ప్రభుత్వం.. మామిడి రైతుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనవసర రాజకీయాలు చేస్తుందంటూ మండిపడుతున్నారు ప్రభుత్వ పెద్దలు.. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా కిలోకి 4 సబ్సిడీ ఇచ్చి రైతులకు అండగా నిలబడిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నష్టాన్ని ముందుగానే అంచనా వేసి మామిడి రైతులను ఆదుకోవాలని సబ్సిడీ ఇచ్చామంటున్నాయి ప్రభుత్వ వర్గాలు..
‘బలహీనమైన ఆటగాడు’ అన్న కార్ల్సెన్.. గ్రాండ్ చెస్ టోర్నమెంట్ లో ఓడించిన గుకేష్ మాగ్నస్ కార్ల్సెన్ తన బహిరంగ మాటలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గ్రాండ్ చెస్ టోర్నమెంట్ ఆరో రౌండ్లో డి గుకేష్ అతన్ని ఓడించాడు. క్రొయేషియాలోని జాగ్రెబ్‌లో జరుగుతున్న గ్రాండ్ చెస్ టోర్నమెంట్లో గురువారం డిఫెండింగ్ ప్రపంచ ఛాంపియన్ డి. గుకేష్ నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్సెన్ను ఓడించి షాకిచ్చాడు. మొదటి రోజు తర్వాత సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచిన భారత ఆటగాడు,…
కోట్ల సూర్య ప్రష్రెడ్డి... ఏపీ పాలిటిక్స్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం నంద్యాల జిల్లా డోన్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారాయన. గతంలో కాంగ్రెస్ తరపున 3 సార్లు ఎంపీగా, ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేశారాయన. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన కుటుంబం కోట్లది. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు సూర్య ప్రకాష్‌రెడ్డి. తర్వాత 2024 ఎన్నికల్లో డోన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారాయన.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంస పాలన కారణంగా రాష్ట్రంలో 450 ఎత్తిపోతల పథకాలు మూతపడ్డాయని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో 1040 ఎత్తిపోతల పథకాలకు కనీసం మరమ్మతులు చేపట్లేదని విమర్శించారు. అందుచేత సగం ఎత్తిపోతల పథకాలు మూలం పడ్డాయని అన్నారు.
బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. వందేళ్ల నుంచి గోదావరిలో ఏటా సగటున 2 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి పోతోందన్నారు. వృథా అవుతున్న నీటిని వినియోగించుకునేందుకే బనకచర్ల ప్రాజెక్టు అని తెలిపారు. ఎగువ ఉన్న తెలంగాణ వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుంటే తాను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని, ఇకపై కూడా చెప్పను అని చెప్పారు. సముద్రంలోకి పోయే నీళ్లను వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.…
రైతులను అన్ని విధాలా ఆదుకునే ప్రభుత్వం తమది అని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా దిగుబడి వచ్చిందని పేర్కొన్నారు. మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటల సాగు ఉండాలన్నారు. ఎప్పుడైనా మామిడిని రైతుల వద్ద నుండి వైసీపీ కొనిందా?, గిట్టుబాటు ధర ఇచ్చిందా? అని ప్రశ్నించారు. రెండు సార్లు తమ ప్రభుత్వమే మామిడికి గిట్టుబాటు ధర ఇచ్చింది అని చెప్పారు. కుప్పంలో సీఎం చంద్రబాబు రెండవ రోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రైతు…
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం రెండో విడత డబ్బుల విడుదలకు డేట్ ఫిక్స్ అయింది. జులై 10న విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. తొలి విడతలో డబ్బులు రాని వారితో పాటు ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో చేరిన వారు ఈ విడతలో లబ్ధి పొందనున్నారు. మొదటి విడతలో 67.27 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి పొందారు.…