మరోసారి ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి .. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్ళనున్నారు.. ఇవాళ రాత్రి ఢిల్లీకి చేరుకొని, రేపు ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగే జరిగే న్యాయసదస్సు కు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు.. కాంగ్రెస్ న్యాయ విభాగం ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్, సమాచార చట్టానికి స్పందించిన అంశాలపై వార్షిక సదస్సు నిర్వహిస్తున్నారు.. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరిగే ఈ సదస్సుకు, ఎఐసిసి ముఖ్య నేతలతో పాటూ,…
ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు.. అనేక అంశాలపై స్పదించారు.. అన్నదాత సుఖీభవ, పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలపై చర్చించిన ఆయన.. సింగపూర్ పర్యటన విశేషాలను నేతలకు వివరించారు.. చెప్పిన విధంగా హామీలు అమలు చేస్తున్నాం.. గత ప్రభుత్వానికంటే రెండింతలు సంక్షేమం ఇస్తున్నాం.. లబ్ధిదారుల సంఖ్య పెరిగింది.. ఆర్థిక చేయూతను పెంచాం. ఈ నెలలోనే సూపర్ సిక్స్ లోని రెండు హామీలు నెరవేరుస్తున్నాం. రేపు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తున్నాం.…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు.. పెన్షన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం.. పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు.. ఇక, పలు అభివృద్ధి కార్యక్రమాల్లోని పాల్గొని తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
Nara Lokesh Responds on YS Jagan Arrest: సింగపూర్ పర్యటన వివరాలను వెల్లడించేందుకు ఈరోజు మంత్రి నారా లోకేష్ సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందాలు, ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు, మద్యం కుంభకోణం.. పలు అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలో మద్యం కుంభకోణం కేసులో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అరెస్ట్ అవుతారా? అని ఓ మీడియా ప్రతినిథి ప్రశ్నించగా.. మంత్రి లోకేష్ ఆసక్తికర సమాధానం చెప్పారు. చట్టం తన పని…
ఒక పక్క ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల కోసం సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు సింగపూర్‌లో పర్యటన చేస్తుంటే.. కొందరు వాటిని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా సింగపూర్ ప్రభుత్వానికి మురళీ కృష్ణ అనే వ్యక్తి ఈ-మెయిల్ పంపించారని తెలిపారు. రేపోమాపో ఏపీలో ప్రభుత్వం మారిపోతుందని, వారితో ఒప్పందాలు చేసుకోవద్దు అందులో పేర్కొన్నారని చెప్పారు. మురళీ కృష్ణ ఎవరా అని చూస్తే.. పెద్దిరెడ్డికి చెందిన ఒక సంస్థలో ఉండే వ్యక్తి అని…
AP Farmers to Receive RS 7000 in First Phase on August 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. ‘అన్నదాత సుఖీభవ’ పథకం తొలి విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. సూపర్ సిక్స్‌లో కీలక హామీ అయిన అన్నదాత సుఖీభవ పథకంను ఆగస్ట్ 2న ప్రకాశం జిల్లా దర్శిలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. 7000 రూపాయలను తొలి విడత సాయం కింద రాష్ట్రంలో అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాలలో ప్రభుత్వం జమ…
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీని ఏడిపించాలని చూస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఎంపీ మిథున్ రెడ్డిను ములాఖత్ లో కలిశారు శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు.. ఈ సందర్భంగా ద్వారకనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. కోర్టులో ఆర్డర్ ఇచ్చినా అన్నింటిలో వేలు పెట్టి చూసే పరిస్థితి కనిపిస్తుందన్నారు.. మిథున్‌రెడ్డిని జైలులో టెర్రరిస్టులు, మావోయిస్టులను చూసినట్టు చూస్తున్నారు అని మండిపడ్డారు..
సింగపూర్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజీ బిజీగా గడుపుతున్నారు.. రెండు రోజుల పాటు కీలక సమావేశాలు, చర్చల్లో పాల్గొన్న ఆయన.. మూడు రోజు సింగపూర్ అధ్యక్షుడు, మంత్రులు, పలు సంస్థల ప్రతినిధులతో సమావేశాలు కాబోతున్నారు.. ముఖ్యంగా నేడు ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్‌టెక్ రంగాలపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు..
CM Chandrababu Naidu Invites Investments to AP: పెట్టుబడులకు ఏపీ రైట్ ఛాయిస్ అని, సేఫ్ ప్లేస్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పెట్టుబడులు పెట్టండి, పేదలకూ సాయం చేయండని కోరారు. ఏపీ-సింగపూర్ స్టార్టప్ ఫెస్టివల్ నిర్వహిస్తాం అని, విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు రండని సీఎం విజ్ఞప్తి చేశారు. ఏపీ-సింగపూర్ బిజినెస్ ఫోరమ్ రోడ్ షోలో సీఎం చంద్రబాబు పై వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలపై సీఎం పవర్…
కోనేరు హంపి ఓటమి.. ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా దివ్య దేశ్‌ముఖ్! 2025 ఫిడే ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్‌గా నాగపుర్‌కు చెందిన 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ నిలిచారు. సోమవారం జార్జియాలోని బటుమిలో జరిగిన టైబ్రేక్ రెండవ ర్యాపిడ్ గేమ్‌లో తెలుగు తేజం కోనేరు హంపీని ఓడించి (2.5-1.5) టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఫైనల్స్‌లో తొలి ర్యాపిడ్ టై బ్రేకర్ డ్రాగా ముగియగా.. రెండో గేమ్‌లో మొత్తం 75 ఎత్తుల్లో దివ్య విజయం సాధించారు. మహిళల చెస్…