At Home: నేడు 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంప్రదాయం ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్ భవన్ లో ‘ఎట్ హోమ్’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తేనీటి విందు ఇచ్చారు. కాగా, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, హైకోర్టు జడ్జిలు, వివిధ రంగాల ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also: Kolkata Doctor Case: డాక్టర్ల నిరసనకు గవర్నర్ సంఘీభావం.. ఆస్పత్రి దగ్గరకు వెళ్లి మద్దతు
అయితే, రాజ్ భవన్ లో జాతీయ గీతాలపానతో ఎట్ హోం ప్రారంభం అయింది. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు.. ఏపీ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ను ఆత్మీయంగా పలకరించారు. అలాగే, రాజ్ భవన్ లోని ఎట్ హోం కార్యక్రమంలో ఏపీ మంత్రి నారా లోకేష్ – వైఎస్ షర్మిళ పరస్పరం అభివాదం చేసుకున్నారు.