ఓవైపు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే.. మరోవైపు పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ముదిరిపోతున్నాయి… సీఎం అమరీందర్ సింగ్, పీసీసీ కొత్త చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూకి అసలు పొసగకుండా తయారవుతోంది పరిస్థితి.. కాంగ్రెస్ అధిష్టానం, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ జోక్యం చేసుకుని సిద్ధూకి పీసీసీ చీఫ్ పోస్టు ఇచ్చిన తర్వాత కూడా పరిస్థితి సద్దుమనిగినట్టు కనిపించడంలేదు.. ఇక, తనకు మద్దతుగా ఉన్న 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇవాళ సిద్ధూ సమావేశం అయ్యారు.. అమృత్‌సర్‌లోని…