Delhi Lt Governor Acts Against Official Amid Row With AAP: ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ఆప్ ప్రభుత్వానికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. గత కొన్ని రోజులుగా ఎల్జీ, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తాజాగా ఓ ఉన్నతాధికారి కార్యాలయాని తాళం వేయాల్సిందిగా ఎల్జీ వీకే సక్సేనా ఆదేశాలు జారీచేశారు. ఢిల్లీలోని డైలాగ్ అండ్ డెవలప్మెంట్ కమిషన్(డీడీసీ) వైస్ చైర్‌పర్సన్ జాస్మిన్ షా తన కార్యాలయాన్ని ఉపయోగించకుండా ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు లెఫ్టినెంట్ గవర్నర్.
రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ కార్యాలయాన్ని దుర్వినియోగం చేశారని.. గత సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల ప్రకారం జాస్మిన్ షా తన అధికారిక వాహనాన్ని, సిబ్బందితో సహా అన్ని ఇతర సౌకర్యాలను, అధికారాలను ఉపసంహరించుకున్నారు. అంతకుముందు జాస్మిన్ షాను తొలగించాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను వీకే సక్సేనా కోరినట్లు సమాచారం. ఈ పదవికి ఢిల్లీ ప్రభుత్వం మంత్రి హోదాను ఇచ్చింది.
Read Also: GVL Narasimha Rao: లిక్కర్ స్కాంలో విజయవాడనుంచి డబ్బులు తరలింపు
జాస్మిన్ షా తన కార్యాలయాన్ని రాజకీయాల కోసం దుర్వినియోగం చేశారంటూ.. బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ చేసిన ఫిర్యాదు మేరకు నెల రోజుల క్రితం లెఫ్టినెంట్ గవర్నర్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. డీడీసీడీ వైస్-ఛైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నప్పుడు, జాస్మిన్ షా రాజకీయ ప్రయోజనాల కోసం ఆప్ అధికార ప్రతినిధిగా వ్యవహరించారని పర్వేష్ వర్మ ఆరోపించాడు. అయితే నోటిసులు అందుకు జాస్మిన్ షా.. డీడీసీడీ పై లెఫ్టినెంట్ గవర్నర్ కు అధికార పరిధి లేదని.. ఇది క్యాబినెట్ నియమించిన మంత్రి స్థాయి పదవి అంటూ సమాధానం ఇచ్చారు. జాస్మిన్ షాకు సీఎం కేజ్రీవాల్ మద్దతు పలికారు. ఢిల్లీ మద్యం స్కామ్ తరువాత లెఫ్టినెంట్ గవర్నర్, ఆప్ ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.