Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్.. హైదరాబాద్ కేంద్రంగా కదులుతున్న డొంక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో దర్యాప్తు ఏజెన్సీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. హైదరాబాద్ కేంద్రంగా లిక్కర్ స్కామ్ డొంక కదులుతోంది. ఈ స్కామ్ లో ముడపుల విషయంలో ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. లిక్కర్ స్కాం కేసులో ఉన్న కంపెనీలకు హైదరాబాద్ కంపెనీల నుండి భారీగా ముడుపులు వెళ్లినట్లు ఆధారాలు ఉన్నాయి. శ్రీనివాసరావుకు చెందిన పలు కంపెనీల నుంచే ముడుపులు వెళ్లినట్లు ఆధారాలను ఈడీ గుర్తించినట్లు సమాచారం. ఈ లిక్కర్ స్కామ్ కేసులో శ్రీనివాసరావు పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. సీఏ బుచ్చిబాబు ఇంట్లో సోదాల అనంతరమే శ్రీనివాస్ రావుపై ఈడీ ఫోకస్ పెట్టింది. దోమలగూడలోని బుచ్చిబాబు ఇంటిలో ఈడీ సుదీర్ఘంగా సోదాలు చేసింది. అతని ఇంట్లో దొరికిన హార్డ్ డిస్క్ లో కీలక సమాచారం లభించినట్లు సమాచారం. కోట్ల రూపాయల లావాదేవీలు శ్రీనివాస రావు ద్వారానే జరిగినట్లు ఆధారాలు దొరికాయి.
పలు కంపెనీల ఏర్పాటుకు సంబంధించిన డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. పలు ఒప్పంద పత్రాలను ఈడీ పరిశీలిస్తుంది. పిళ్ళై, శ్రీనివాసరావు మధ్య జరిగిన సంభాషణలను ఈడీ రిట్రైవ్ చేసింది. సిగ్నల్ యాప్ ద్వారా ఇద్దరి మధ్య సంభాషనలు కొనసాగాయి. వీరిద్దరి నుంచి ఈడీ కీలక సమాచారాన్ని సేకరించింది. మొత్తం లావాదేవీలు శ్రీనివాసరావు ద్వారానే జరిగినట్లు ఈడీ వద్ద ఆధారాలు ఉన్నాయి. లిక్కర్ టెండర్ల కోసం ఈ డబ్బును చెల్లించారా..? లేకపోతే మరేదానికైనా చెల్లించారా.? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.
Also Read
- Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
Read Also: UK: హిందూ దేవాలయంపై దాడి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరిన భారత్
లిక్కర్ స్కీమ్ కోసం వేయాల్సిన టెండర్ల లైసెన్సు కోసం రెండువేల కోట్ల రూపాయలు హైదరాబాద్ నుంచి వెళ్లినట్లు ఈడీ గుర్తించింది. 18 జోన్లకు సంబంధించి తొమ్మిది లిక్కర్ కంపెనీలకు హైదరాబాద్ వ్యాపారవేత్తలతో లింకులను గుర్తించారు. ఈ డబ్బు ఎవరి ఖాతా నుంచి వెళ్లిందనే అంశంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. సాలిగ్రామ్ ఐటీ కంపెనీ, పవిత్రపై ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, వరుణ్ సన్ షోరూమ్,గోల్డ్ స్టార్ మైన్స్ అండ్ మినరల్స్ సంస్థలను శ్రీనివాస్ రావు నిర్వహిస్తున్నారు. సాలిగ్రామ్ ఐటీ కంపెనీ రామాంతపూర్ లో ప్రారంభించారు.. అయితే ఈ ఐటీ కంపెనీ అడ్రస్ మాత్రం ఏపీలోని కడప రిజిస్ట్రేషన్ ఇచ్చాడు శ్రీనివాస రావు. ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్న పిళ్లై, అభిషేక్ రావ్, గండ్ర ప్రేమ్ సాగర్, సృజన్ రెడ్డిలకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసిన శ్రీనివాస్ రావ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్‌లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!