వైఎస్ఆర్ జిల్లా, అన్నమయ్య జిల్లాల సరిహద్దులోని గువ్వల చెరువు ఘాట్ ఐదవ మలుపు వద్ద దొరికిన మూడు మృతదేహాల మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఎనిమిది బృందాలుగా వీడి దర్యాప్తు చేసిన పోలీసులు మూడు మృతదేహాలు గువ్వల చెరువు ఘాట్ లోకి రావడానికి వెనుక ఉన్న కన్నీళ్లు తెప్పించే విషయాలను జిల్లా ఎస్పీ కేకే అన్బు రాజన్ మీడియాకు వెల్లడించారు. ముగ్గురి మృతదేహాలు దొరికిన చోట లబించిన ఆధారాల మేరకు క్లూస్ టీమ్ లను రంగంలోకి దింపామని చెప్పారు.
అన్నమయ్య జిల్లాకు చెందిన 12మంది కూలీలు బసవయ్య అనే మేస్త్రీ నేతృత్వంలో కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా వద్ద బొగ్గులు కాల్చే పనికి వెళ్లారు. అక్కడ కలుషిత నీరు తాగడం వల్ల అస్వస్థతకు గురయ్యారని పోలీసులు చెప్పారు. గుల్బర్గా వద్ద జిల్లేడుపల్లి గ్రామ సమీపంలోని ఎండిన కాలువలోని చెలిమిలో నీటిని సేవించి అస్వస్థతకు గురైనట్లు విచారణలో తేలిందన్నారు. వాంతులు, విరేచనాలతో తీవ్ర అనారోగ్యానికి గురై, పలు చోట్ల చికిత్స చేయించుకున్నారు. కర్నూల్ ఆసుపత్రిలో ఒక చిన్నారి చనిపోగా, మరో ముగ్గురు మార్గ మధ్యంలో చనిపోయారని తమ విచారణలో తేలిందన్నారు. మృత దేహాలను గ్రామానికి తీసుకు రావద్దని చెప్పడంతో ఇలా ఘాట్ లో మృత దేహాలను వదలి వెళ్లారని ఎస్పీ వివరించారు. అనారోగ్యానికి గురైన మిగిలిన కూలీలకు ప్రభుత్వం తరపున వైద్యం, ఇతర సహాయం అందిస్తున్నామని చెప్పారు.
Colour Photo: జాతీయ అవార్డు విన్నింగ్ సినిమా.. మెగా డాటర్ మిస్ అయ్యిందే..?