Minister Harish Rao countered the remarks of the Opposition in the Telangana Assembly budget meetings. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 7న ప్రారంభమయ్యాయి. అయితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజునే ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు 2022-23 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్యు నల్ల కండువాలు ధరించి ఆందోళన చేపట్టడంతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్…
Minister Harish Rao countered CLP leader Bhatti's remarks at the 2022 Telangana Assembly budget meetings. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంతో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా మాటల యుద్ధం నడుస్తోంది. అయితే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో పాటు, పలు విషయాలపై అధికార పార్టీకి ప్రశ్నలు…
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసురించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ తెలంగాణ బంగారు అయ్యిందని, ఇక దేశాన్ని బంగారు దేశంగా మర్చుతా అని తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ వస్తే ప్రాజెక్టులు పూర్తి అవుతాయని, ప్రజలు అభివృద్ధి చెందుతారు అని సోనియా గాంధీ అనుకున్నారని, కానీ కేసీఆర్ ప్రజల్ని భ్రమల్లో ఉంచుతున్నారని…
తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇదేనంటూ ఆయన జోస్యం చెప్పారు. మైనార్టీ అభివృద్ధిని కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తామని ఆయన తెలిపారు. కలెక్టర్‌లుగా ఎంత మందికి అర్హత ఉంది అన్నది చూడాలని ఆయన అన్నారు. ఎస్పీలలో చాలా మందికి అర్హత లేదని ఆయన అన్నారు. అందుకు అధికారులు కేసీఆర్‌కు లాయల్‌గా ఉంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.ఐదుగురు అధికారుల చేతుల్లో 40 శాఖలున్నాయని.. అధికారుల అండతో సీఎం…
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తన పాదయాత్రలు కల్లు రుచి చూశారు.. మధిర నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గత ఆరు రోజుల నుంచి మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రను కొనసాగుతున్న విషయం తెలిసిందే కాగా.. ఈ రోజు పాదయాత్ర వల్లభి గ్రామ సమీపానికి చేరుకుంది.. ఈ సమయంలో కల్లు గీత కార్మికులు కల్లు తాగాల్సిందిగా భట్టిపై ఒత్తిడి చేయడంతో.. ఓ పట్టుపట్టి ఖుషి అయ్యారు.. ఇక, ప్రజలకు మెడిసిన్ మాదిరిగా ఉపయోగపడే కల్లును దూరం చేయడానికి…
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజీనామా ఎపిసోడ్ తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తనపై కోవర్ట్ ముద్ర వేసి అవమానాలకు గురిచేస్తున్నారని.. బాధతో రాజీనామా చేస్తున్నట్లు జగ్గారెడ్డి టీ కాంగ్రెస్‌లో ప్రకంపనలు పుట్టించారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ ఎమ్మెల్యే అయిన జగ్గా రెడ్డి ప్రకటనతో పార్టీలో ఒక్కసారిగా అలజడి రేగింది. గాంధీ కుటుంబంపై అభిమానం ఉన్నప్పటికీ తన వ్యక్తిత్వాన్ని కాపాడుకునేందుకే పార్టీని వీడనున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఈ నేపథ్యంలో నేడు సీఎల్పీ నేతలు…
తెలంగాణలోని ఆసుపత్రిలో ఖాళీలను భర్తీ చేయాలని, పీహెచ్ సీల పడకల సామర్థ్యాన్ని పెంచాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోగ్య మంత్రి హరీష్ రావు కు వినతిపత్రం అందచేశారు. పేద, సామాన్య ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందడానికి యుద్ధ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని మంత్రిని కోరారు. శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు వినతిపత్రం అందజేశారు భట్టి…
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిర్చి రైతుల కంట కన్నీరు ఆగడం లేదు. పంటలు పండకపోవటంతో భారీ నష్టాల్లో కూరుకుపోయారు. అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మిర్చి రైతుల కష్టాలు అన్నీ ఇన్నీకావు. గత యేడాది మిర్చి సాగు చేసిన రైతుల పంట పండింది. ఎగుమతులు సైతం పెరిగాయి. విదేశాల నుంచి ఆర్డర్లు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో 18 వేల పైచిలుకు ధర పలుకుతోంది. గతంలో ఏసీ మిర్చికి మాత్రమే…
తెలంగాణలో కేసీఆర్ పాలనపై మండిపడ్డారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ఖాళీగా వున్ర పోస్టు లను భర్తీ చేయకుండా బదిలీల చేయడమేమిటని అన్నారు. మూడున్నర లక్షల ఉద్యోగ వ్యవస్థ ను అగమ్యగోచరంగా తయారు చేశారు. స్థానికత ను ప్రధానంగా తీసుకోకుండా బదిలీలు చేశారన్నారు. స్థానికత కోసమే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగిన విషయాన్ని ప్రభుత్వం మర్చిపోయింది. ఉద్యోగం చేస్తున్న భార్య కేసులను కూడా పట్టించుకోక పోవడం దారుణం. అనారోగ్యం ఉన్న వారిని పట్టించుకోకుండా బదిలీలు చేశారు.…
సీఎం దత్తత గ్రామం ఎర్రవెల్లి లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే రచ్చబండ కార్యక్రమానికి వెళ్లకుండా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, MLC జీవన్ రెడ్డి, MLA శ్రీధర్ బాబులతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులతో గృహనిర్బంధం చేయించిన కేసీఆర్ సర్కారు చర్యను తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్కతీవ్రంగా ఖండించారు. దేశంలో స్వేచ్ఛా స్వాతంత్రం కల్పించిన రాజ్యాంగానికి విరుద్ధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ప్రతి…