Bhatti Vikramarka: పాదయాత్రలో కల్లు తాగిన భట్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తన పాదయాత్రలు కల్లు రుచి చూశారు.. మధిర నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గత ఆరు రోజుల నుంచి మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రను కొనసాగుతున్న విషయం తెలిసిందే కాగా.. ఈ రోజు పాదయాత్ర వల్లభి గ్రామ సమీపానికి చేరుకుంది.. ఈ సమయంలో కల్లు గీత కార్మికులు కల్లు తాగాల్సిందిగా భట్టిపై ఒత్తిడి చేయడంతో.. ఓ పట్టుపట్టి ఖుషి అయ్యారు.. ఇక, ప్రజలకు మెడిసిన్ మాదిరిగా ఉపయోగపడే కల్లును దూరం చేయడానికి జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తమ కోసం గళమెత్తాలని గౌడన్నలు సీఎల్పీ నేతకు విజ్ఞప్తి చేశారు.. ఈ సందర్భంగా గీత కార్మికులు సీఎల్పీ నేతను కల్లు రుచి చూడాలని బ్రతిమిలాడడంతో… ఆయన కల్లు రుచి చూశారు.
Read Also: High Court: వెంటనే గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్ తెరవాలి.. హైకోర్టు ఆదేశాలు
Also Read
- Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
ఇక, పీపుల్స్ మార్చ్‌లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నిరుద్యోగులు, పెన్షన్ దారులు, రేషన్ కార్డుల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.. ప్రజల కోసం చేసే పీపుల్స్ మార్చ్ ను వ్యతిరేకించే వాళ్ళని దూరం ఉంచాలని సూచించిన ఆయన.. ఉమ్మడి రాష్ట్రంలో బంగారు తల్లి పథకం పేరుతో ఆడపిల్లలకు మూడు లక్షలు ఇచ్చామని గుర్తుచేశారు.. సబ్సిడీ విత్తనాలు ఇవ్వకుండా రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టినందుకు పాలాభిషేకం చేయాలా? అంటూ కేసీఆర్‌పై ఫైర్ అయిన ఆయన.. మద్దతు ధర అడిగిన రైతులకు బేడీలు వేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది అని మండిపడ్డారు.. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచిత విద్యుత్ అందించామని.. కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులను మధ్యవర్తులుగా మార్చిందని విమర్శించారు. రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్‌దేనని.. రాబోయే ఎన్నికల్లో రైతులు కేసీఆర్‌కు ఉరి వేయడం ఖాయమని జోస్యం చెప్పిన భట్టి.. ప్రజలకు ప్రజావ్యతిరేకంగా పనిచేస్తే రాబోయే రోజుల్లో ఎవరికైనా ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.. బీజేపీకి పనిచేస్తానన్న కేసీఆర్.. ఆ పార్టీ ఎంపీ సుబ్రమణ్య స్వామిని ఎలా కలిసారు అని నిలదీశారు భట్టి విక్రమార్క.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాదులు భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తున్నాయని ఆరోపించిన ఆయన.. సుబ్రమణ్యస్వామిని ఎందుకు కేసీఆర్ కలిసాడో బయట పెట్టాలని డిమాండ్ చేశారు..
తాజావార్తలు
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!