గ్రీన్ ఎనర్జీ ఉత్పాదకతను పెంచి భవిష్యత్తు అవసరాలకు సరిపడే విద్యుత్తును సమకూర్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ–2025’ని రూపొందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ కొత్త పాలసీని ఆమోదించింది. 2030 నాటికి 20,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తు సామర్థ్యం అదనంగా సమకూర్చుకోవాలనేది కొత్త పాలసీ లక్ష్యం.