పహల్గామ్ ఉగ్రదాడి భారత్‌ను భగ్గుమనేలా చేసింది. ఆపరేషన్ సిందూర్ కారణంగా భారత్ పాక్ మధ్య యుద్ధంలాంటి పరిస్థితి దాపురించింది. తాజాగా ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. ఈ సమాచారాన్ని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అందించారు. కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఇంతలో పలువురు రాజకీయ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ అంశంపై మాట్లాడారు.
'ఆపరేషన్ సిందూర్'తో నిరాశ చెందిన పాకిస్థాన్.. భారతదేశంలోని సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ భారత సైన్యం ఈ దాడిని తిప్పికొట్టింది. ఈ అంశంపై వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి సమాచారం ఇచ్చారు. గత 24 గంటల్లో పాకిస్థాన్ సైన్యం భారతదేశాన్ని ఎలా లక్ష్యంగా చేసుకుందో వివరించారు. వారి ఎత్తుగడలు ఏవీ విజయవంతం కాలేదని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ లక్ష్యం ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం..
Pakistan Shelling : భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ అనంతరం, జమ్మూ-కశ్మీర్ రాష్ట్రంలోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద పాకిస్తాన్ సైన్యం బుధవారం చేసిన ఘనమైన దాడులు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ దాడుల్లో 15 మంది పౌరులు మరణించగా, 43 మంది గాయపడ్డారు. ధ్వంసమైన ఇళ్లు, పగిలిన దుకాణాలు, దగ్ధమైన వాహనాలు, రక్తపు మరకలు, శిథిలాలతో సరిహద్దు గ్రామాలు భయానకంగా మారిపోయాయి. ఆలయాలు, స్కూళ్లు, మసీదులపై కూడా పాకిస్తాన్ సైన్యం షెల్లింగ్ చేసి దాడి చేసింది.…
భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జమ్ముకశ్మీర్ లోని ఎల్‌వొసి వెంట పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. పహల్గాం దాడి అనంతరం భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మెరుపు దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం పాక్ ఆర్మీ విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 15 మంది భారత పౌరులు మృతి చెందారు. 43 మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని భారత ఆర్మీ ధృవీకరించి వివరాలు వెల్లడించింది. వెల్లడించింది.
అమెరికా వైమానిక దాడిలో మరణించిన వారి సంఖ్య 74 కి పెరిగిందని, 171 మంది గాయపడ్డారని యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు పేర్కొన్నారు. దేశంలోని చమురు ఓడరేవును లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. అసోసియేటెడ్ ప్రెస్ (AP) నివేదిక ప్రకారం.. హౌతీ తిరుగుబాటుదారులు ఈ సమాచారాన్ని బహిరంగ ప్రకటనలో ఇచ్చారు. అయితే.. ఈ వాదనను అమెరికా సైన్యం ఇంకా ధృవీకరించలేదు. గత నెల రోజుల వైమానిక దాడుల్లో ఇప్పటివరకు జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇదేనని హౌతీ…
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలోని తమ ప్రభుత్వ అధిపతి ఇస్సామ్ అల్-దాలిస్ సహా పలువురు ఉన్నతాధికారులు మరణించారని హమాస్ ధృవీకరించింది . ఈ దాడుల్లో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధిపతి మహమూద్ అబు వాట్ఫా, అంతర్గత భద్రతా సేవ డైరెక్టర్ జనరల్ బహ్జత్ అబు సుల్తాన్ కూడా తుది శ్వాస విడిచారు. కీలక నాయకులు, వారి కుటుంబాలతో పాటు జియోనిస్ట్ ఆక్రమణ దళాల విమానాల ప్రత్యక్ష దాడిలో అమరులయ్యారని హమాస్ ప్రకటనలో పేర్కొంది. తాజా ఉద్రిక్తత…