అమెరికా వైమానిక దాడిలో మరణించిన వారి సంఖ్య 74 కి పెరిగిందని, 171 మంది గాయపడ్డారని యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు పేర్కొన్నారు. దేశంలోని చమురు ఓడరేవును లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. అసోసియేటెడ్ ప్రెస్ (AP) నివేదిక ప్రకారం.. హౌతీ తిరుగుబాటుదారులు ఈ సమాచారాన్ని బహిరంగ ప్రకటనలో ఇచ్చారు. అయితే.. ఈ వాదనను అమెరికా సైన్యం ఇంకా ధృవీకరించలేదు. గత నెల రోజుల వైమానిక దాడుల్లో ఇప్పటివరకు జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇదేనని హౌతీ తిరుగుబాటుదారులు తెలిపారు.
READ MORE: Toshiba : రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ.. రూ.562 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం
మీడియా నివేదికల ప్రకారం.. యెమెన్‌లోని ప్రధాన రాస్ ఇసా ఓడరేవుపై వైమానిక దాడులను అమెరికా సైన్యం ధృవీకరించింది. ఈ దాడుల లక్ష్యం హౌతీ తిరుగుబాటుదారుల ఆర్థిక సామర్థ్యాలను బలహీనపరచడమే అని సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపింది. ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు తమ సైనిక కార్యకలాపాలను కొనసాగించడానికి, నియంత్రణను స్థాపించడానికి, దిగుమతుల నుంచి లాభాలను సంగ్రహించడానికి ఇంధనాన్ని ఉపయోగిస్తారని ఎక్స్‌లో పేర్కొంది. మరోవైపు, అమెరికా సైన్యం ప్రకారం, రాస్ ఇసా ఓడరేవు హౌతీ తిరుగుబాటుదారుల ఆర్థిక శక్తికి ప్రధాన వనరు. అక్కడి నుంచి వచ్చే ఇంధన ఆదాయాన్ని ఆయుధాలు, సైనిక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని.. అందువల్ల పోర్ట్‌ను ‘డీగ్రేడ్’ చేయడం అంటే దాన్ని నిలిపివేయడం అవసరమని భావించారు.
READ MORE: Toshiba : రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ.. రూ.562 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం