TTD Parakamani Case: టీటీడీ పరకామణి చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణకు హాజరైన సమయంలో CVSO సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం హైకోర్టుకు తెలిసినట్లు పేర్కొంది.. ఇదే సమయంలో కీలక ఆదేశాలు జారీ చేశారు హైకోర్టు… ఈ కేసులో నిందితుడు రవికుమార్‌తో పాటు సాక్ష్యులకు భద్రత కల్పించాలని స్పష్టం చేసింది.. పరకామణి చోరీ కేసు విచారణ ముగిసే వరకు సాక్ష్యులకు ప్రొటెక్షన్ ఇవ్వాలని ఏపీ సీఐడీ…
Prakash Raj : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కేసులో సీఐడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. నిన్న హీరో విజయ్ దేవర కొండను విచారించిన సీఐడీ.. నేడు ప్రకాశ్ రాజ్ ను ప్రశ్నించింది. ప్రకాశ్ రాజ్ నేడు రెండోసారి బెట్టింగ్ యాప్స్ కేసులో సీఐడీ ముందుకు విచారణకు వచ్చాడు. ఇందులో సీఐడీ అనేక ప్రశ్నలు వేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కంటెంట్ ఎలా వచ్చింది, డబ్బులు ఎవరు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, వాటిని ఏం చేశారు అనే కోణంలో…
Betting Apps Case : బెట్టింగ్ యాప్స్ కేసులో సీఐడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలను విచారించిన అధికారులు నేడు విజయ్ దేవరకొండతో పాటు సిరి హనుమంతును విచారించారు. ఇప్పటికే విజయ్ విచారణ పూర్తి కాగా.. తాజాగా సిరి విచారణ జరుగుతోంది. బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంతు నిషేధిత బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిందని కేసు నమోదైన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు పెద్ద ఎత్తున రెమ్యునరేషన్…
HCA Corruption: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఉపాధ్యక్షుడు దల్జీత్ సింగ్, జాయింట్ సెక్రటరీ బసవరాజుపై సీఐడీకి ఫిర్యాదు అందింది. మల్టిపుల్ క్లబ్ ఓనర్‌షిప్ ప్రయోజనాలతో హెచ్‌సీఏ ఎన్నికల్లో గెలిచారని అంబుడ్స్‌మన్, సీఐడీకి హెచ్‌సీఏ మాజీ కోశాధికారి చిట్టి శ్రీధర్ ఫిర్యాదు చేశారు.
HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆర్థిక అవకతవకల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఐదుగురిని సీఐడీ అధికారులు ఈ రోజు కస్టడీలోకి తీసుకోనున్నారు. మల్కాజ్‌గిరి కోర్టు ఆరుగురికి కస్టడీ అనుమతి ఇవ్వడంతో, ఇప్పటికే చర్లపల్లి జైలులో ఉన్న నిందితులను సీఐడీ జూలై 21 వరకు అదుపులో ఉంచనుంది. కస్టడీకి అనుమతి లభించిన వారిలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, సీఈవో సునీల్, ట్రెజరర్ శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్…
HCA IPL Tickets Scam:హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఐపీఎల్ టికెట్ల వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. ఐపీఎల్ టికెట్ల కేటాయింపులో భారీగా ఆర్థిక అక్రమాలు జరిగాయని తెలుస్తుండటంతో సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాస్ రావు, CEO సునీల్, జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, ఆయన భార్య కవితలను సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. Read Also:Cabinet Meeting: నేడే తెలంగాణ కేబినెట్ భేటీ.. సర్పంచ్…
ఫాల్కన్ గ్రూప్ సీఓఓ(చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) ఆర్యన్ సింగ్ అరెస్ట్ అయ్యాడు.. ఆర్యన్ సింగ్ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫాల్కన్ పెంపెనీ 7056 డిపాజిట్దారుల నుంచి రూ. 4215 కోట్లు వసూలు చేసింది. డిపాజిట్దారులకు రూ. 792 కోట్ల మోసానికి పాల్పడింది. చిన్న మొత్తంలో పెట్టుబడులకు భారీ లాభం అంటూ మోసం చేసింది.
కిడ్నీ రాకెట్ మాఫియాలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. దర్యాప్తులో విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయి. సరూర్‌నగర్‌లో అలకనదం హాస్పిటల్ కేంద్రంగా కిడ్నీ రాకెట్ కొనసాగింది. సరూర్‌నగర్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసును, ఇటీవలే సీఐడీకి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 13మంది అరెస్ట్ కాగా... మరో ఏడుగురి కోసం గాలింపు చేపడుతున్నారు. కిడ్నీ రాకెట్ సూత్రధారి పవన్ అలియాస్ లియోన్ శ్రీలంక నుంచే దందా నడిపినట్లు తెలిసింది.
సరూర్‌నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసులో సీఐడీ దూకుడు పెంచింది. తాజాగా సీఐడీ పోలీసులు కిడ్నీ రాకెట్ కేసులో మరో ఇద్దరు అరెస్టు చేశారు. కిడ్నీ రాకెట్ కేసులో మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు.
ఫాల్కన్ స్కాం కేసులో సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో సీఐడీ మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. తెలంగాణ సీఐడీ బీహార్ లో ఇద్దరిని అరెస్ట్ చేసింది. పట్టుబడ్డ ఇద్దరు నిందితులు A2 అమర్ దీప్ కుటుంబ సభ్యులు. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కాంలో నేరస్థులుగా ఉన్నారని..