ఆంధ్రప్రదేశ్‌లో మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన సంచలనం సృష్టించింది.. అయితే, ఇది అగ్నిప్రమాదం కాదని.. ఉద్దేశ్యపూర్వకంగానే కీలక దస్త్రాల్ని కాల్చివేశారని పోలీసులు తేల్చారు.. దీనిపై విచారణ సాగుతూ వస్తున్న తరుణంలో.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఘటనను సీఐడీకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెండు, మూడు రోజుల్లో దీనిపై ఉత్తర్వులు జారీ చేయనుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం..
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నారా లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ సీఐడీ విచారణ ముగిసింది. స్కిల్ కేసులో రాజేష్‌ను సీఐడీ విచారించింది. ఉదయం పదిన్నర నుంచి సీఐడీ విచారణ కొనసాగింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఉదయం నారా లోకేష్ సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి నారా లోకేష్ ను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. లోకేశ్ పై ఈ కేసులో ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.
ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన దర్యాప్తు అధికారులు… విచారణకు హాజరుకావాలంటూ ముగ్గురు నిందితులకు నోటీసులిచ్చారు. గత ప్రభుత్వంలో ఈ గవర్నెన్స్ సలహాదారుగా ఉన్న వేమూరి హరి ప్రసాద్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండిగా చేసిన సాంబశివరావుతో పాటు.. టెండరు దక్కించుకున్న టెరా సాఫ్ ఎండి గోపీచంద్ కు నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న ముగ్గురిలో హరిప్రసాద్, సాంబశివరావు విచారణకు హాజరు అయ్యారు. సత్యనారాయణ పురంలోని సీఐడీ రిజనల్ కార్యాలయంలో రెండు గంటల పాటు నిందితులను…
రైతుల తరపున రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటానికి నేను సిద్ధం అన్నారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. ఇవాళ మరోసారి సీఐడీ విచారణకు హాజరైన ఆయన.. అంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో జే టాక్స్ పేరుతో ధాన్యం దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.. సమయం అంతా దేవినేని ఉమను, ధూళిపాళ్ల నరేంద్రని ఇబ్బంది పెట్టడానిఇ వెచ్చిస్తున్నారన్న ఆయన.. దేవినేని ఉమను 9 గంటలు సీఐడీ కార్యాలయంలో కూర్చోబెడితే ఏమి వస్తుంది? అంటూ మండిపడ్డారు..…