HCA Corruption: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఉపాధ్యక్షుడు దల్జీత్ సింగ్, జాయింట్ సెక్రటరీ బసవరాజుపై సీఐడీకి ఫిర్యాదు అందింది. మల్టిపుల్ క్లబ్ ఓనర్షిప్ ప్రయోజనాలతో హెచ్సీఏ ఎన్నికల్లో గెలిచారని అంబుడ్స్‌మన్, సీఐడీకి హెచ్‌సీఏ మాజీ కోశాధికారి చిట్టి శ్రీధర్ ఫిర్యాదు చేశారు. అయితే, 2022 వరకు కమర్షియల్ ట్యాక్సెస్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహించిన బసవరాజు, ప్రభుత్వ ఉద్యోగంలో నుంచి రిటైర్మెంట్ అనంతరం 2023లో దల్జీత్ సింగ్ కుటుంబానికి చెందిన అమీర్‌పేట్ క్రికెట్ క్లబ్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. దల్జీత్ సింగ్ కుటుంబం ఆధ్వర్యంలో అమీర్‌పేట్ క్రికెట్ క్లబ్, ఖాల్సా క్రికెట్ క్లబ్‌లు నడుస్తున్నాయి.
Read Also: Tollywood strike : సినీ కార్మికుల 7వ రోజు సమ్మె అప్డేట్
ఇక, మల్టీపుల్ క్లబ్ ఓనర్‌షిప్ నిబంధనల ఉల్లంఘనతో 57 క్లబ్‌లపై జస్టిస్ లావు నాగేశ్వరావు వేటు వేశారు. అదే రూల్ ప్రకారం దల్జీత్ సింగ్ కుటుంబానికి చెందిన క్లబ్‌లపైనా సస్పెన్షన్ విధించాలని చిట్టి శ్రీధర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దల్జీత్ సింగ్ కుటుంబానికి చెందిన రెండు క్లబ్‌ల నుంచి హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు, సంయుక్త కార్యదర్శి పదవులు దక్కించుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఫిర్యాదుపై హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌కి అందిన వివరాలను ఆధారంగా చేసుకుని సీఐడీ అధికారులు చిట్టి శ్రీధర్ నుంచి మరింత సమాచారం సేకరించారు.