HCA : హెచ్‌సీఏ కుంభకోణం కేసులో కీలక మలుపు.. ఐదుగురు నిందితులు సీఐడీ కస్టడీలోకి
- నకిలీ పత్రాలతో క్లబ్ ఏర్పాటు చేసిన జగన్‌మోహన్ రావు
- హెచ్‌సీఏ నిధుల దుర్వినియోగంపై సీఐడీ లోతైన దర్యాప్తు
- మల్కాజ్‌గిరి కోర్టు ఆరుగురు నిందితులకు ఆరు రోజుల కస్టడీ అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆర్థిక అవకతవకల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఐదుగురిని సీఐడీ అధికారులు ఈ రోజు కస్టడీలోకి తీసుకోనున్నారు. మల్కాజ్‌గిరి కోర్టు ఆరుగురికి కస్టడీ అనుమతి ఇవ్వడంతో, ఇప్పటికే చర్లపల్లి జైలులో ఉన్న నిందితులను సీఐడీ జూలై 21 వరకు అదుపులో ఉంచనుంది.
కస్టడీకి అనుమతి లభించిన వారిలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, సీఈవో సునీల్, ట్రెజరర్ శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత యాదవ్, సెక్రటరీ రాజేందర్ యాదవ్ ఉన్నారు. వీరిపై హెచ్‌సీఏ క్లబ్‌లలో జరిగిన అవకతవకలు, గత ఎన్నికల్లో చోటు చేసుకున్న అనుమానాస్పద పరిణామాలపై సీఐడీ అధికారులు లోతుగా విచారించనున్నారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
Virat Kohli: ‘కింగ్’ కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డ్.. మరో ఆటగాడికి సాధ్యం కాదేమో?
నిందితుల బెయిల్ పిటిషన్లను ఇటీవలే కోర్టు తిరస్కరించింది. విచారణ వేగవంతం కావలసిన అవసరం ఉందని కోర్టు సూచించింది. గురువారం ఉదయం నుంచి సీఐడీ కస్టడీలో దర్యాప్తు కొనసాగనుంది.
ఇదిలా ఉండగా, నకిలీ పత్రాలతో శ్రీచక్ర క్రికెట్ క్లబ్‌ను ఏర్పాటు చేసి హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నికలకు పోటీ చేసినట్లు జగన్మోహన్‌రావుపై ఆరోపణలు వచ్చాయి. గౌలిపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు సీ. కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు సీఐడీ ఆధారాలు సేకరించింది.
నిధుల దుర్వినియోగంపై, అక్రమ లావాదేవీలపై సీఐడీ మరింత లోతుగా దర్యాప్తు చేపట్టనుంది. కోర్టు అనుమతితో సంబంధిత ఆర్థిక రికార్డులు, సాక్ష్యాలను సేకరించేందుకు సీఐడీ సిద్ధమవుతోంది.
ఒకప్పుడు దేశానికి గొప్ప క్రికెటర్లను అందించిన హెచ్‌సీఏ… ఇప్పుడు అవినీతి ఆరోపణలతో దేశ వ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటోంది. బీసీసీఐ నుంచి వస్తున్న నిధులు నిర్వాహకుల జేబుల్లోకి వెళ్లిపోతున్నాయని, క్రికెట్ అభివృద్ధి గాలికొదిలేశారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం జరిగిన అరెస్టులతో పాటు, కస్టడీ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Air India: B-787 విమానాల తనిఖీ పూర్తి.. ఫ్యుయల్ కంట్రోల్ స్విచ్‌ల్లో ఎలాంటి లోపం లేదన్న ఎయిర్ ఇండియా
తాజావార్తలు
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!