మద్యం మత్తులో ఉన్నప్పుడు కొందరికి అసలు స్పృహ ఉండదు. మత్తులో ఏం చేస్తున్నారో వారికి అవగాహన ఉండదు. మద్యం సేవించి ఆ మత్తులో వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.
చిత్తూరు జిల్లా పెనుమూరులో ఇంటర్ విద్యార్థిని మృతి సంచలనం రేపుతోంది.17వ తేదీ రాత్రి అదృశ్యమైన కావూరివారిపల్లె పంచాయతీ, ఠాణా వేణుగోపాలపురంకి చెందిన భవ్యశ్రీ .. గ్రామంలో వినాయక నిమజ్జనం చేస్తుండగా చెరువులో శవమై కనిపించింది.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృత్యువాతపడ్డారు. ఆగి ఉన్న పాల వ్యాన్‌ను అంబులెన్స్ ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
చిత్తూరు జిల్లాలోని పలమనేరులో నకిలీ వజ్రాలతో ఘరానా మోసానికి ప్రయత్నం చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుంచి 12 నకిలీ వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు.
గోల్డ్ మైనింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఎన్‌ఎండీసీ వర్గాలు చెబుతన్నాయి.. ప్రాంతీయ చట్టాల ప్రకారం ఈ బ్లాక్ కోసం మైనింగ్ లీజుకు తీసుకున్న మూడేళ్ల లోపు గని పనులు పూర్తి చేయాల్సి ఉండగా.. 1.83 మిలియన్ టన్నుల బంగారం నిల్వలు కలిగిన ఈ బ్లాక్‌లో టన్నుకు 5.15 గ్రాములు మాత్రమే బంగారం రానున్నదని అంచనా వేస్తున్నారు.
Hospital:ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యం కొన్ని ఘటనలతో బయటకు వస్తూనే ఉంది.. ఎంతో మంది తమకు సరైన వైద్యం అందించడంలేదని.. సరైన సమయంలో స్పందించడంలేదని ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు.. కొన్ని సందర్భాల్లో దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.. చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలు అయ్యింది.. బాత్‌రూమ్‌లో తొడ ఎముక విరిగి ఆపరేషన్ చేసుకుందామని ప్రభుత్వాసుపత్రికి వచ్చింది దళవాయిపల్లికి చెందిన పుష్పమ్మను(62) అనే వృద్ధురాలు.. అయితే, ఎక్సరేలు, స్కానింగ్ లు ఇతరత్రా టెస్టులన్ని…