Gold Mining: తెలుగు రాష్ట్రాల్లో ఖనిజ సంపదకు లోటు లేదు.. ఇక, ఇప్పుడు బంగారపు గనుల తవ్వకాల వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయి.. ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్‌ఎండీసీ.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో బంగారం గని కోసం చర్యలను వేగవంతం చేసింది. అందులో భాగంగా తొలి విడతలో 61 మిలియన్ డాలర్లు అంటే రూ.500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టేందుకు సిద్ధం అయ్యింది..
Read Also: Aviation Industry: పెరుగుతున్న ప్రయాణికులు.. మూతపడుతున్న విమాన సంస్థలు
గోల్డ్ మైనింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఎన్‌ఎండీసీ వర్గాలు చెబుతన్నాయి.. ప్రాంతీయ చట్టాల ప్రకారం ఈ బ్లాక్ కోసం మైనింగ్ లీజుకు తీసుకున్న మూడేళ్ల లోపు గని పనులు పూర్తి చేయాల్సి ఉండగా.. 1.83 మిలియన్ టన్నుల బంగారం నిల్వలు కలిగిన ఈ బ్లాక్‌లో టన్నుకు 5.15 గ్రాములు మాత్రమే బంగారం రానున్నదని అంచనా వేస్తున్నారు.. కాగా, రాష్ట్రంలోని అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో బంగారం నిక్షేపాలు ఉన్నట్టు గతంలోనే గుర్తించారు.. జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మరికొన్ని సంస్థలు సర్వే నిర్వహించి. ఏ ప్రాంతాల్లో.. ఏ మేరకు బంగారం ఖనిజ నిల్వలు ఉన్నాయనే అంశంపై సమాచారాన్ని సేకరించిన విషయం విదితమే.
ఇందులో కీలకమైన బంగారపు గని.. చిత్తూరు జిల్లా ఉంది.. కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండంలం చిగరగుంట-బీసంతంలో బంగారపు గనులను గుర్తించారు. ఈ గనిలో సుమారుగా 18 లక్షల టన్నుల బంగారం ఖనిజం ఉండవచ్చు అనే అంచనాలున్నాయి.. ఇక, తవ్వకాలు చేపట్టేందుకు ఎన్‌ఎండీసీ రెడీ అవుతోంది.. దీని కోసం ఇప్పటికే ఏపీ సర్కార్‌తో ఎల్‌వోఐ (లెటర్ ఆఫ్ ఇంటెంట్)పై సంతకాలు చేసింది.. దీనికి తదుపరి చర్యగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మైనింగ్ లీజు తీసుకోబోతోంది. అన్ని రకాల అనుమతలును రెండేళ్లలో పూర్తి చేసి బంగారం గని తవ్వకాలు ప్రారంభించడమే ఎన్‌ఎండీసీ ఆలోచనగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
Read Also: Mahadevi Stotram: సర్వేంద్రియాలు అదుపు చేసి శక్తినిచ్చే మహాదేవి పారాయణం
ఆంధ్రప్రదేశ్‌లోని బ్లాక్‌లో 18.3 లక్షల టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని వినియోగిస్తున్న దేశం చైనా కాగా, భారత్ తర్వాతి స్థానంలో ఉంది. ప్రస్తుతం భారత్ 90 శాతం బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. 2022లో విదేశాల నుంచి బంగారం కొనుగోలు చేసేందుకు భారత్ 3,660 కోట్ల డాలర్లు అంటే దాదాపు రూ. 3 లక్షల కోట్లు వెచ్చించింది. 2021లో ఇది 5,580 కోట్ల డాలర్లుగా రికార్డు సృష్టించనుంది. ప్రస్తుతం కర్ణాటకలోని హట్టి గోల్డ్ మైన్స్ కంపెనీ లిమిటెడ్ దేశంలోనే బంగారాన్ని ఉత్పత్తి చేస్తోన్న విషయం విదితమే.