High Tension: చంద్రబాబు పర్యటనలో టెన్షన్ టెన్షన్.. వైసీపీ, టీడీపీ శ్రేణుల రాళ్ల దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Tension: టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లు కూడలిలో చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.. చంద్రబాబు ముందే వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.. చంద్రబాబు గో బ్యాక్ అంటూ వైసీపీ నినాదాలు చేయగా.. దీంతో, వైసీపీ, టీడీపీ నేతల మధ్య పరస్పరం దాడులకు దారితీసింది.. రాళ్లతో ఇరువర్గాలు దాడులు చేసుకున్నారు.. రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.. ఈ దాడుల్లో టీడీపీతో పాటు, వైసీపీ శ్రేణులకు కూడా గాయాలయ్యాయని చెబుతున్నారు.. పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక, అంగళ్లు వద్ద కారు దిగిపోయారు చంద్రబాబు.. ఆయన సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కేడర్ రాళ్లదాడి చేసినట్టు తెలుస్తోంది.. అయితే, వైసీపీ కార్యకర్తలను తరిమికొట్టాలంటూ చంద్రబాబు మైక్‌లో చెప్పారని.. దీంతో, వైసీపీ కేడర్‌ను టీడీపీ శ్రేణులు తరిమినట్టుగా చెబుతున్నారు.. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇక, చిత్తూరు జిల్లా పుంగనూరులో చంద్రబాబు పర్యటనలోనూ టెన్షన్ వాతావరణం నెలకొన్ని విషయం విదితమే.. పుంగనూరులో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడానికి వైసీపీ సిద్ధం అయ్యాంది.. చంద్రబాబు గో బ్యాక్ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.. పుంగనూరులో ప్రాజెక్టులు రానీయకుండా చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అడుగు పెట్టనివ్వబోమంటూ నినాదాలు చేశారు.. కానీ, పుంగనూరులో రోడ్ షో చేసి తీరుతామంటున్నాయి టీడీపీ శ్రేణులు.. 500 మంది పోలీసులతో భారీభధ్రత ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ వెల్లడించారు.
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
తాజావార్తలు
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!