Hospital:ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యం కొన్ని ఘటనలతో బయటకు వస్తూనే ఉంది.. ఎంతో మంది తమకు సరైన వైద్యం అందించడంలేదని.. సరైన సమయంలో స్పందించడంలేదని ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు.. కొన్ని సందర్భాల్లో దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.. చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలు అయ్యింది.. బాత్‌రూమ్‌లో తొడ ఎముక విరిగి ఆపరేషన్ చేసుకుందామని ప్రభుత్వాసుపత్రికి వచ్చింది దళవాయిపల్లికి చెందిన పుష్పమ్మను(62) అనే వృద్ధురాలు.. అయితే, ఎక్సరేలు, స్కానింగ్ లు ఇతరత్రా టెస్టులన్ని బయట ప్రైవేటుగా చేసుకోవాలని ముప్పతిప్పలు పెట్టారు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు.. నానా కష్టాలు పడిన ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌ల వెంట తిరిగిన వృద్ధురాలు డబ్బు ఖర్చు చేసి వారు అడిగిన ఎక్స్‌రేలు, స్కానింగ్‌లు, టెస్ట్‌లకు సంబంధించిన అన్ని రిపోర్టలకు తీసుకొచ్చింది..
Read Also: Mallu Ravi: వార్ రూమ్ కేసు విచారణ.. సంక్రాంతి తర్వాత వస్తానన్న మల్లు రవి
అయితే, తీరా అన్ని టెస్ట్ ల రిపోర్ట్‌లను పరిశీలించిన వైద్యులు.. ఆమెకు ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు.. ఆపరేషన్ కూడా ప్రారంభించారు.. కానీ, ఆ వృద్ధురాలికి అమర్చాల్సిన ప్లేటు లేదని తెలియడంతో ఆపరేషన్‌ను అర్ధాతంరంగా నిలిపివేశారు.. అంతేకాదు.. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి ఆపరేషన్ చేయించుకోవాలని ఉచిత సలహాలు ఇచ్చారు.. వయసు పైబడిన తన తల్లిని ఇలా ముప్ప తిప్పలు పెట్టి, ఇప్పుడు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లమనడం ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని పుష్పమ్మ కుమారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇక చేసిది లేక పుష్పమ్మను ప్రైవేటు హాస్పిటల్ కు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు బంధువులు. ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు చర్చగా మారింది..