2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్యే పోటీ ఉంటుందని జోస్యం చెప్పారు.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్.
కేంద్రంలోనే కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్… ఇవాళ తిరుపతిలో కాంగ్రెస్ పాదయాత్ర నిర్వహించింది.. కేంద్ర మాజీ మంత్రులు సుబ్బరామిరెడ్డితో కలిసి పాల్గొన్నారు చింతా మోహన్.. ఈ సందర్భంగా అంబేద్కర్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చింతామోహన్ మాట్లాడుతూ.. ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అనని గుర్తుచేశారు.. నేడు దళితులు దేవాలయాలకు, విద్యాలయాలకు వెళ్తున్నారంటే కారణం కాంగ్రెస్…
ఏపీలో రాజకీయాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోనసీమలో అల్లర్ల గురించి ఆయన స్పందిస్తూ.. అంబేద్కర్ పేరు కోనసీమ ప్రాంతానికి పెట్టడం చిన్న విషయం అని.. అంబేద్కర్ లాంటి మహనీయుడి పేరును రాష్ట్రాలకు పెట్టాలని సూచించారు. అంబేద్కర్ జీవితం ఇప్పటి నేతలకు ఆదర్శమన్నారు. వైసీపీ చేసిన బస్సు యాత్ర తుస్సుమందన్నారు. వైసీపీ మంత్రుల బస్సు యాత్రకు ప్రాధాన్యత లేదని.. కనీసం వారి మాటలు వినడానికి జనాలు లేరని చురకలు…
మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య శత జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. తిరుపతిలో కేంద్ర మాజీ మంత్రి , కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ దామోదం సంజీవయ్య శత జయంతి సందర్భంగా నివాళులర్పించారు. తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య చేసిన సేవలను శ్లాఘించారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దామోదం సంజీవయ్య ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చారన్నారు చింతా మోహన్. వృధ్ధాప్య ఫించన్లు, అవినీతిపై ప్రత్యేక చట్టం, బలిజ ,కాపులకు రిజర్వేషన్లు ఇచ్చిన…
దేశంలో సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ సీడబ్యూసీ మెంబర్ చింతామోహన్ . దేశ పరిస్థితులు బాగాలేవని, ధరలు బాగా పెరిగిపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. వంటగ్యాస్ ధర మళ్ళీ పెరగబోతోందన్నారు. గ్యాస్ సిలిండర్ వెయ్యిరూపాయలు దాటబోతోందని, పెట్రోల్ డిజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆయన అన్నారు. భారత్ దేశంలో ఆకలి కేకలు ఎక్కువగా ఉన్నాయని, నిరుద్యోగం బాగా పెరిగిపోయిందని విమర్శించారు చింతా మోహన్. ఒకవైపు సామాన్యుడు వందరూపాయలు సంపాదించలేక ఆకలితో అలమటించి పోతుంటే..…
అమ్మకానికి భారత దేశం ఉందని… వేలకోట్ల పెట్టి విమానాలు కొని తిరుగుతున్నారు మొట్టమొదటి ప్రధాని మోడీ అని మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకానికి పెట్టారు మొట్టమొదటి ప్రధాని మోడీ. క్యాబినెట్ సమావేశనికి ఆలస్యంగా వస్తారు కానీ ఏఒక్క మంత్రి గొంతు వినపడదు. చివరకు విద్యుత్ డిస్కంలు అమ్మకానికి పెట్టిన ఘనుడు ఆయన అన్నారు. దేశంలో గడ్డుకాలం నడుస్తుంది.. రైతులను జీపులతో గుద్ది చంపించారు అని తెలిపారు. ఇక ఏపీలో విద్యుత్…
త్వరలోనే విశాఖ,గుంటూరుకు రాహుల్ గాంధీ రానున్నారు అని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు చింతా మోహన్ తెలిపారు. అమరావతి,విశాఖ ఉక్కు పోరాటానికి మద్దతుగా పర్యటన చేయనున్నారు రాహుల్ గాంధీ. అయితే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ కొరత ఉంది.. సిద్దాంతపరంగా బలంగా ఉన్నప్పటికీ ప్రజా ఆమోదయోగ్యమైన నాయకత్వం లేదు. అటువంటి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నాం అని చింతా మోహన్ తెలిపారు. త్వరలో పీసీసీలో మార్పులు ఉంటాయి. కానీ అధ్యక్షుడు ఎన్నికల రేస్ లో నేను లేను…
మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ కాంగ్రెస్ పార్టీపై షాకింగ్ కామెంట్స్ చేసారు. కాంగ్రెస్ పార్టీకి లీడర్లు లేరు.. కేడర్ లేదు. ఇదే పెద్ద సమస్య అని ఆయన తెలిపారు. రాజా మహరాజాల రోజులు కావు.. అందుకే పంజాబ్ లో సీఎంను తీసి అవతల పారేశారు అన్నారు. కొన్ని నిర్ణయాలు చేయాలనుకుంటారు.. చేస్తారు.. వైెెఎస్సారును సీఎం చేయొద్దని చెప్పాను.. కానీ చేశారు. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీలో ఏ క్షణమైనా.. ఏమైనా జరగొచ్చు అని పేర్కొన్నారు. ఇక…