త్వరలోనే విశాఖ,గుంటూరుకు రాహుల్ గాంధీ రానున్నారు అని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు చింతా మోహన్ తెలిపారు. అమరావతి,విశాఖ ఉక్కు పోరాటానికి మద్దతుగా పర్యటన చేయనున్నారు రాహుల్ గాంధీ. అయితే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ కొరత ఉంది.. సిద్దాంతపరంగా బలంగా ఉన్నప్పటికీ ప్రజా ఆమోదయోగ్యమైన నాయకత్వం లేదు. అటువంటి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నాం అని చింతా మోహన్ తెలిపారు. త్వరలో పీసీసీలో మార్పులు ఉంటాయి. కానీ అధ్యక్షుడు ఎన్నికల రేస్ లో నేను లేను అన్నారు. మూడు రాజధానులు తొందరపాటు నిర్ణయం…అఖిలపక్ష సమావేశం తర్వాత అందరి అభిప్రాయం తీసుకుని ఉంటే బాగుండేది. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. జాతీయ పార్టీగా బీజేపీ ప్రభుత్వం కుట్రలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కట్టుబడి వుంది. SCఫైనాన్స్ కార్పొరేషన్ మూసివేయడం అన్యాయం. నవంబర్ 1లోగా తెరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. SC,ST,OBCమైనారిటీ విద్యార్థుల స్కాలర్ షిప్ లు, మెస్ బిల్లులు,ఫీజ్ రీ ఎంబర్స్ మెంట్ బిల్లులు తక్షణమే చెల్లించాలి అని డిమాండ్ చేసారు.