అయోధ్యను బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. అయోధ్య ఈవెంట్‌తో దేశం సంతోషంగా వుందని చాటి చెప్పే ప్రయత్నం చేశారని ఆయన వ్యాఖ్యానించారు.
తిరుపతిలో మీడియాతో మాట్లాడిన చింతా మోహన్.. తిరుపతి నుండి ఎమ్మెల్యేగా చిరంజీవి పోటీ చేయాలని కోరనున్నట్టు తెలిపారు.. అంతేకాదు మా ముఖ్యమంత్రి అభ్యర్థి చిరంజీవియే ఉంటారని స్పష్టం చేశారు. కాపులకు ఇదే సరైనా సమయమని పిలుపునిచ్చారు. ఇక, చిరంజీవిని నేనే స్వయంగా పార్టీలో ఆహ్వానిస్తానని పేర్కొన్నారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్.
ఏపీలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అనుకుంటున్నారని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ గ్రామీణ ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్నారన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని తెలిపారు. తెలంగాణలో మాదిగలను మోసం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
Chinta Mohan: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో ఏపీ కాపు అభ్యర్థి సీఎం కావడం ఖాయమని స్పష్టం చేశారు. కాపు ముఖ్యమంత్రిని చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందని తెలిపారు. 175 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని.. 100 స్థానాల్లో గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. రోజు రోజుకు ప్రధాని…
Chinta Mohan: ఇద్దరు చంద్రుల మధ్య వివాదమే ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీకి కారణంగా అభివర్ణించారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్.. చంద్రబాబు అక్కడ (తెలంగాణలో) సభ పెడితే.. కేసీఆర్ ఇక్కడ (ఆంధ్రప్రదేశ్లో) పెడుతున్నాడన్నారు. ఇక, ఎన్టీఆర్ లాగా కేసీఆర్ కు కూడా ప్రధాని కావాలనే ఆశ ఉందేమో..? అనే అనుమానాలను వ్యక్తం చేశారు.. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మళ్లీ రానే రాదు అని జోస్యం చెప్పారు.. వైసీపీ పైకి ఎన్ని గొప్పలు చెప్పినా..…