చైనా చాలా కాలంగా జనాభా రేటు తగ్గుదలపై ఆందోళన చెందుతోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశమైన చైనా ఈ సమస్యను అధిగమించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ ప్రయత్నాల వల్ల సామాన్యులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనాభా రేటును పెంచడానికి చైనా అనేక చర్యలు తీసుకుంటోంది.. జనాభాకు ఆకర్షణీయమైన వాగ్దానాలు చేస్తోంది. జనాభాను పెంచేందుకు వీలుగా వివాహ ప్రక్రియను సులభతరం చేసి.. విడాకుల అంశాన్ని సంక్లిష్టం చేయాలని కమ్యూనిస్ట్ ప్రభుత్వం నిర్ణయించింది.