ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది.. ఇది ఒక వ్యాపార ప్రకటనే కావొచ్చు.. కానీ, ఓ రైతుకు చేసిన ఆలోచన.. అతడిని కష్టాల్లోకి నెట్టింది.. ఏకంగా రెండు రోజుల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి.. దాదాపు 320 కిలోమీటర్లు గాల్లోనే ప్రయాణం చేసిన తర్వాత.. అతడిని కాపాడారు పోలీసులు… ఇంతకీ.. రైతుకు వచ్చిన ఆ ఆలోచన ఏంటి? ఎలా బెడిసికొట్టింది…? ఇంతకీ ఏం జరిగింది..? అతడిని ఎలా కాపాడారు అనే వివరాల్లోకి వెళ్తే..
Read Also:Balapur Ganesh Laddu New Record in Auction: రూ.24.60 లక్షలు పలికిన బాలాపూర్ గణేష్ లడ్డూ..
చైనాలోని హిలాంగ్ షియాంగ్ ప్రావిన్స్‌లోని ఫారెస్ట్ పార్క్‌లో పైన్ కాయలను కోసేందుకు రైతులు హైడ్రోజన్ బెలూన్‌ను ఉపయోగించారు. ఈ చెట్లు సన్నగా పొడవుగా ఉండడంతో కాయలు కోసేందుకు రైతులు కొందరు హైడ్రోజన్ బెలూన్లను ఉపయోగిస్తూనే ఉంటారు.. పైన్ చెట్లకు పెట్టింది పేరైన ఈ ప్రాంతంలో.. ఆదివారం నాడు తన ఇంటిపేరు హు మరియు భాగస్వామిగా గుర్తించబడిన వ్యక్తి పైన్ గింజలను సేకరించేందుకు సిద్ధమయ్యారు.. హైడ్రోజన్ బెలూన్ సాయంతో పైకి ఎగిరి తాడు పట్టుకుని కాయలు కోయడం మొదలుపెట్టారు.. కానీ, ఒక్కసారిగా తాడి తెగిపోయింది. దీంతో ఓ రైతు వెంటనే కిందకు దూకేయగా.. మరో రైతు మాత్రంబెలూన్‌తోపాటే గాల్లోకి ఎగిరిపోయాడు. అప్పటి నుంచి హు కోసం గాలింపు చర్యలు మొదలుపెటట్ఆరు.. అలా హైడ్రోజన్ బెలూన్‌తో ఎగిరిపోయిన రైతు దాదాపు 320 కిలోమీటర్లు ప్రయాణించి రష్యా సరిహద్ వరకు వెళ్లిపోయాడు..
అప్పటికే అతడి కోసం రంగంలోకి దిగిన పోలీసులు.. వాతి రోజు ఉదయం సెల్‌ఫోన్ ద్వారా హుతో మాట్లాడగలిగారు. బెలూన్ నుంచి బయటపడే మార్గాన్ని చెప్పారు.. కిందికి ఎలా రావాలో సూచనలు చేశారు.. బెలూన్‌లోని గాలిని నెమ్మదిగా తగ్గించమని సూచించారు. వారు చెప్పినట్టే చేసిన హు ఎట్టకేలకు కిందికి దిగాడు. హు ఆరోగ్యంగానే ఉన్నట్టు అధికారులు తెలిపారు. అయితే, అతడు వెన్ను నొప్పితో బాధపడుతున్నట్టు వెల్లడించారు.. గాల్ బెలూన్ ఎగురుతున్నంత సేపు తాడును పట్టుకుని వేలాడుతుండడం వల్లే అతడు వెన్ను నొప్పి వచ్చిందని తెలిపారు.. గురువారం నాడు హైలిన్ ఫారెస్ట్రీ అడ్మినిస్ట్రేషన్ కో యొక్క ప్రచార విభాగంలోని ఓ అధికారి ఈ బెలూన్ ఘటనను ధృవీకరించారు.. హు వయస్సు 40 ఏళ్లు అని.. ప్రస్తుతం ఆసుపత్రిలో హు కోలుకుంటున్నారని తెలిపారు..