China's Ex President Jiang Zemin Dies: చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ బుధవారం 96 ఏళ్ల వయసులో షాంఘైలో కన్నుమూశారు. చైనాను ఆర్థిక శక్తిగా నిలబెట్టడంతో పాటు ప్రజా ఉద్యమాలను అత్యంత క్రూరంగా అణచివేసిన వ్యక్తిగా జియాంగ్కు పేరుంది. బుధవారం లుకేమియా, అవయవాల వైఫల్యంతో మరణించినట్లు ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ( సీసీపీ) ఆయన మరణానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. ‘‘కామ్రేడ్ జియాంగ్ జెమిన్ ఒక అద్భుతమైన నాయకుడు...…
China: చైనా.. రోజురోజుకు ఇంకా దిగజారి ప్రవర్తిస్తోంది. తమ ఉనికిని చాటుకోవడానికి అమాయక ప్రజలను ఎరగా వేస్తోంది. దీనికోసం ఎంతకు దిగజారింది అంటే.. సోషల్ మీడియాలో ఉద్యమాల గురించి తెలియకూడదని ఆ పేరు మీద బూతు బొమ్మలను చూపించేలా చేస్తున్నారు.
బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి రిషి సునాక్ విదేశాంగ విధానంపై రిషి సునాక్ ప్రసంగించారు. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. చైనాతో మాత్రం ఇందుకు విరుద్ధంగా పనిచేస్తామని తేల్చి చెప్పారు.
ఎంతోమందికి ఎన్నో వింత రుగ్మతలు ఉంటాయి. కొంతమంది మట్టి తింటారు. మరికొంత మంది చాక్పీసులు కరకర నమిలేస్తుంటూరు. ఇలాంటి వివిధ వింత రుగ్మతల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. తాజాగా చైనాలోని షాన్స్కీ ప్రావిన్స్కు చెందిన ఓ 14 ఏళ్ల బాలిక కూడా ఓ విచిత్రమైన రుగ్మతతో ఆస్పత్రిలో చేరింది.
డ్రాగన్ దేశంలో జీరో కొవిడ్ విధానాన్ని కఠినంగా అమలు చేయడంపై మొదలైన ఆందోళనలు మరింత విస్తరిస్తున్నాయి. దేశంలోని బీజింగ్ సహా పలు నగరాల్లో ప్రజలు పెద్దఎత్తున నిరసనల్లో పాల్గొంటున్నారు. దేశమంతటా దాదాపు 40,000 కొత్త కొవిడ్ కేసులు నమోదవడంతో అధికారులు ఆంక్షలను కఠినతరం చేశారు.
China holds first Indian Ocean Region meet with 19 countries without India: అవకాశం దొరికితే భారత్ ను ఎలా దెబ్బతీయాలా..? అనే ఆలోచనలోనే ఉంటుంది డ్రాగన్ కంట్రీ చైనా. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఆసియా పరిధిలో భారత్ ప్రాముఖ్యత, ప్రాధాన్యత పెరగడాన్ని తట్టుకోలేకపోతోంది చైనా. భారత ప్రాధాన్యతను తగ్గించాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఇటీవల చైనా హిందూ మహాసముద్ర ప్రాంత సమావేశాన్ని నిర్వహించింది. హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాలు…
Anti-Covid protests flare up in China: కోవిడ్ లాక్ డౌన్ వ్యతిరేకంగా చైనా దేశంలో తీవ్ర నిరసనలు జరుగుతున్నాయి. కమ్యూనిస్ట్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు, యువత పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొంటున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ దిగిపోవాలని, చైనా కమ్యూనిస్ట్ పార్టీ దిగిపోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రజలు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. చైనాలో నిరసన కార్యక్రమాలు జరగడం చాలా చాలా అరుదు. అటువంటిది అక్కడ ‘జీరో కోవిడ్’ విధానం పాటిస్తుండటంతో ప్రజలు…
Pig Hotel: పందుల కోసం ప్రత్యేకంగా ఫైవ్ స్టార్ హోటలా..? నమ్మశక్యంగా లేదు కదూ.. నిజమండి అక్కడ వాటి కోసం ఏకంగా 26అంతస్థుల పిగ్ హోటల్ నిర్మించారు. అంతేకాదు వాటికోసం ప్రత్యేకంగా ఏసీలను కూడా పెట్టారు.
చైనాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 10 మంది మంటలకు ఆహుతి అయ్యారు. వాయువ్య చైనాలోని షింజియాంగ్లో ఓ అపార్ట్మెంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. మరో తొమ్మిది మంది గాయపడ్డారు.
Chinese boy watches 'too much' television, gets punished with all-night TV binge by parents: చైనాలో పేరెంట్స్ తమ కుమారుడికి వింత శిక్ష విధించారు. ఎక్కువ సమయం టీవీ చూస్తున్నాడని 8 ఏళ్ల కుమారుడికి రాత్రంతా టీవీ చూపించి శిక్ష విధించారు. ప్రస్తుతం ఈ జంట చేసిన పని సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. చైనాలోని ఓ జంట తమ ఎనిమిదేళ్ల కుమారుడికి రాత్రంతా టీవీ చూపించినందుకు నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.…