China Praises Modi: ప్రధాని నరేంద్రమోడీపై చైనా ప్రశంసలు కురిపించింది. మోడీ హయాంలో భారత్ ఆర్థిక, సామాజిక పాలన, విదేశాంగ విధానాల్లో గణనీయమైన ప్రగతిని సాధిస్తోందని చైనీస్ స్టేట్ మీడియా ఏజెన్సీ గ్లోబల్ టైమ్స్ ప్రశంసించింది. అభివృద్ధి చెందడంలో భారత్ వ్యూహాత్మకంగా, నమ్మకంగా, క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని తన ఆర్టికల్‌లో వ్యాఖ్యానించింది. షాంఘైలోని ఫుడాన్ యూనివర్శిటీలోని సౌత్ ఏషియన్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్ జాంగ్ జియాడాంగ్ రాసిన కథనాన్ని ప్రముఖ ప్రభుత్వ-చైనీస్ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ ప్రచురించింది.…
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విధానాలపై విమర్శనాత్మకంగా స్పందించారు. చైనాతో భారత సంబంధాల విషయంలో మాట్లాడుతూ ఆయన చరిత్రలో జరిగిన అంశాలను గుర్తు చేశారు. ఢిల్లీలో ‘వై భారత్ మాటర్స్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో పాల్గొన్న జైశంకర్.. చైనా, పాకిస్తాన్, అమెరికా సంబంధాలను గురించి మాట్లాడారు.
ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా డ్రాగన్ కంట్రీ చైనా పేరుగాంచింది. అయితే, గత కొంతకాలంగా చైనా ఆర్థిక వ్యవస్థ డీలా పడింది. కరోనా అధ్యాయం ముగిసిన తర్వాత నుంచి తమ ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని ఆ దేశ అగ్రనాయకత్వం వెల్లడించారు.
బ్రిటన్ లో చదువుకునే వారికి అక్కడి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బ్రిటన్‌లో చదువుకునేందుకు భారత్‌తో పాటు విదేశాల నుంచి వెళ్లే విద్యార్థులు తమ బంధువులను తమ వెంట తీసుకెళ్లకూడదని చెప్పారు.
చైనా సరఫరా గొలుసు ఆధిపత్యాన్ని సవాల్ చేసేలా భారత దేశం నిలవడం ఈ ప్రపంచానికి అవసరమని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. 2024లో మనకు లభించే గొప్ప అవకాశం ఇదే అని అన్నారు.
జమ్మూ కాశ్మీర్లో సైన్యంపై ఉగ్రవాదులు చైనా తయారు చేసిన ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగిస్తున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వర్గాల ప్రకారం.. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు సైన్యంపై దాడి చేయడానికి చైనా ఆయుధాలు, బాడీసూట్ కెమెరాలు, కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగిస్తున్నాయి.
Xi Jinping: చైనా అధ్యక్షుడు, కమ్యూనిస్ట్ పార్టీ అధినేత షి జిన్‌పింగ్, పార్టీ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అధికార కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నేతలు వ్యక్తిగత చిత్తశుద్ధిని కాపాడుకోవాలని, బంధువులను అవినీతికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. సిపిసి (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా) సెంట్రల్ కమిటీ యొక్క పొలిటికల్ బ్యూరో సభ్యులు మార్క్సిస్ట్ మేధావుల ప్రమాణాలను పాటించాలని, మొత్తం పార్టీ వ్యక్తిగత సమగ్రతకు, క్షమశిక్షణకు ఉదాహరణగా నిలుస్తారని అన్నారు. డిసెంబర్ 22న కీలక పార్టీ సమావేశంలో…
Doctor Punches Patient: ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఓ డాక్టర్ విచక్షణ మరిచి ప్రవర్తించాడు. పేషెంట్ తలపై కొట్టాడు. ఈ ఘటన చైనాలో 2019లో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డాక్టర్ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019 ఓ సర్జన్ 82 ఏళ్ల వృద్ధురాలికి సర్జరీ చేస్తూ, ఆమె తలపై మూడుసార్లు కొట్టాడు. ఈ ఘటనపై ప్రస్తుతం చైనా అధికారలుు దర్యాప్తు చేస్తున్నారు.
Poonch attack: జమ్మూ కాశ్మీర్ పూంచ్‌లో గురువారం జరిగిన ఉగ్రవాద దాడిలో ఐదుగురు జవాన్లు మరణించారు. పక్కా ప్లాన్ ప్రకారం ఎత్తైన ప్రాంతం నుంచి ఆర్మీ వాహనాలపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనకు పాక్ ఆధారిత లష్కరే తోయిబా ఉగ్రసంస్థకి చెందిన పీఏఎఫ్ఎఫ్ పనిగా బాధ్యత ప్రకటించింది. అయితే ఈ దాడి వెనక దాయాది దేశం పాకిస్తాన్‌తో పాటు దాని ఆప్తమిత్ర దేశం చైనా ఉన్నట్లుగా నిఘావర్గాలు తెలుపాయి.
12 dead in China Coal Mine Accident: భూకంపం సృష్టించిన విధ్వంసం నుంచి చైనా ప్రజలు తేరుకోకముందే.. ఆ దేశంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు గనిలో సంభవించిన పెను ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం చైనాలోని ఈశాన్య ప్రావిన్స్ హీలాంగ్జియాంగ్లో చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివరాలు ప్రకారం… హెంగ్షాన్ జిల్లా జిక్సీ నగరంలోని కున్యువాన్ బొగ్గు గనిలో బుధవారం ప్రమాదం…