Trump: ప్రజా ఉద్యమంతో ఇరాన్ అట్టుడుకుతోంది. సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మతపాలనకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చారు. రాజధాని టెహ్రాన్‌తో పాటు అన్ని ప్రావిన్సుల్లో ప్రజాందోళన ఎగిసిపడుతోంది. ఇదిలా ఉంటే, ఈ ఉద్యమాన్ని బలవంతంగా అణిచివేసేందుకు ఖమేనీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.