ఈడీ ముందు హాజరైన ఎల్.రమణకు అస్వస్థతకు గురయ్యారు. ఈడీ విచారిస్తున్న సమయంలో బీపీ డౌన్ కావడంతో.. ఆయనకు ఆసుపత్రికి తరలించారు. ఎల్.రమణ అనారోగ్యంతో వున్నట్లు తెలుస్తోంది. ఆయనకు బీపీ డౌన్ కావడంతో కొందికి పడిపోవడంతో స్పందించిన అధికారులు ఆయనతో పాటు ఎల్.రమణ గన్ మెన్ , ఈడీ కి సంబంధించిన ఒక అధికారిని ఆయనతో పాటు ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణలో ‘చీకోటి’ క్యాసినో కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచిన విషయం తెలిసిందే. దీంతో.. ఈడీ విచారణ రాజకీయ వేడిని పెంచుతోంది. విదేశాల్లో క్యాసినో అక్రమ నిర్వహణ వ్యవహారంపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.