ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 26 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మకు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని మీడియా కోడైకూసింది.
మహారాష్ట్ర ఎన్నికల్లో సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు బరిలో నిలుచున్నదెవరో తేలిపోయింది. ఇక ప్రచార రంగంలోకి అభ్యర్థులు దిగనున్నారు. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య పోటాపోటీ నెలకొంది. ఇదిలా ఉంటే మహాయుతి కూటమిలో ముఖ్యమంత్రి పదవిపై తీవ్ర చర్చ జరుగుతోంది
ముఖ్యమంత్రి పదవిపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పనిని బట్టి హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. పార్టీకి క్రమశిక్షణ చాలా కీలకమని.. క్రమశిక్షణ లేకుంటే ఏమీ ఉండదని తెలిపారు.
ఇవాళ రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి పేరును ప్రకటించే విషయంపై బీజేపీ సమావేశం కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత రేపు జైపూర్‌లో శాసనసభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నట్లు ఎన్‌సిపి నేత అజిత్ పవార్ చేసిన ప్రకటనపై మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అజిత్ పవార్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలో తప్పు లేదని, అయితే అందరూ ముఖ్యమంత్రి కాలేరని అన్నారు.