ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 26 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మకు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని మీడియా కోడైకూసింది. కానీ చివరికి రేఖా గుప్తాను అదృష్టం వరించి సీఎం పోస్టు తన్నుకుపోయారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో ఆమెకు మంచి సంబంధాలు ఉండడంతోనే సీఎం పదవి ఆమెకు దక్కిందని వార్తలు వినిపిస్తు్న్నాయి. అయితే సీఎం పదవి దక్కలేదన్న అసంతృప్తి.. పర్వేష్ వర్మ, ఆయన మద్దతుదారులకు ఉన్నట్లు సమాచారం. చాలా అసంతృప్తిగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన.. మరో ఏక్‌నాథ్ షిండే కావొచ్చన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీకి 48, ఆప్‌కు 22 స్థానాలు దక్కాయి. ప్రభుత్వానికి కావాల్సింది 35 సీట్లు ఉంటే సరిపోతుంది.
ఇది కూడా చదవండి: Phone Tapping Case: “హరీష్ రావు పేరు చెప్పాలని పోలీసులు ఒత్తిడి చేశారు”.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్..
న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి రాజకీయ ఉద్దండును పర్వేష్ వర్మ ఓడించారు. ‘జెయింట్ కిల్లర్’గా వర్మకు పేరుంది. అలాంటిది ఆయనకు సీఎం పదవి దక్కకపోవడంతో అసంతృప్తిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గతేడాది మహారాష్ట్రలో మహాయుతి కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఏక్‌నాథ్ షిండే వర్గం ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించింది. కానీ బీజేపీనే ఎక్కువ సీట్లు సాధించింది. దీంతో కాషాయ పార్టీ సీఎం పోస్టును ఇతరులకు ఇచ్చేందుకు ఇష్టపడలేదు. దీంతో చాలా రోజులు పంచాయితీ జరిగింది. చివరికి దేవేంద్ర ఫడ్నవిస్‌కు ముఖ్యమంత్రి పదవి దక్కింది. మొత్తానికి ఏక్‌నాథ్ షిండే మెత్తబడి.. డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు.
ఇది కూడా చదవండి: PM Modi: అన్ని రంగాల్లో కొత్త నాయకత్వం రావాలి.. కాన్‌క్లేవ్ సదస్సులో మోడీ పిలుపు
తాజాగా ఢిల్లీలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. పర్వేష్ వర్మ కూడా ముఖ్యమంత్రి పదవి కోసం చాలా ప్రయత్నాలు చేశారు. కానీ హైకమాండ్ చివరికి రేఖా గుప్తా వైపు మొగ్గు చూపింది. అయితే పర్వేష్ వర్మ.. భవిష్యత్‌లోఏక్‌నాథ్ షిండేలా చేసే పరిస్థితులు లేవని తెలుస్తోంది. అధిష్టానం చెప్పినట్లుగానే వెళ్లొచ్చని సమాచారం.
ఇక పర్వేష్ వర్మకు మంచి మంత్రి పదవినే కట్టబెట్టింది. మేనిఫెస్టో హామీలు నెరవేర్చే విధంగా కీలక పోస్టు అప్పగించింది. ఇక ముఖ్యమంత్రి రేఖా గుప్తా కంటే వర్మ చిన్నవాడే. ప్రస్తుతం ఆయన వయసు (47). ఇక వర్మ క్రమశిక్షణ నాయకుడిగా పేరుంది. కనుక రేఖా గుప్తాతో కలిసి వెళ్లొచ్చని తెలుస్తోంది. భవిష్యత్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: Return of the Dragon Review: రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ రివ్యూ.. ప్రదీప్ రంగనాథన్ ఇంకో హిట్ కొట్టాడా ?