Child Pornography: ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు (సోమవారం) కీలక తీర్పును ఇచ్చింది.
న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా, నిజాయితీగా, స్వచ్ఛంగా ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం అన్నారు. పశ్చిమ బెంగాల్ లో జరిగిన నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ ప్రాంతీయ సదస్సులో బెనర్జీ ప్రసంగిస్తూ.. “పశ్చిమ బెంగాల్‌లో 88 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి.
ఎన్నికల బాండ్లవివరాల వెల్లడికి ఎస్బీఐ అదనపు సమయం కోరడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత ఎన్నికల కమిషన్‌కు అన్ని ఎలక్టోరల్ బాండ్ లావాదేవీల వివరాలను అందించడానికి అదనపు సమయం కావాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.
సుప్రీం కోర్టులో సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి నిన్న (శుక్రవారం) రెండు విస్కీ బాటిళ్లను పెట్టడంతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ షాక్ అయ్యారు.
ఏదైనా కేసులో తీర్పు ఇచ్చే ముందు న్యాయమూర్తులు రాజ్యాంగానికి, చట్టానికి లోబడే నిర్ణయం తీసుకుంటారని అందులో వారి వ్యక్తిగత అభిప్రాయాలు ఉండబోవని సుప్రీంకోర్డు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సోమవారం ఇద్దరు కొత్త న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇద్దరు న్యాయమూర్తుల నియామకంతో సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34కి చేరింది.
న్యాయాధికారుల శిక్షణ కోసం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కాజ వద్ద ఏర్పాటు చేసిన ఏపీ జ్యుడీషియల్ అకాడమీని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రారంభించారు.
భారతదేశంలో ఎవరినైనా ప్రేమించడం, కులాంతర వివాహం చేసుకోవడం, వారి కుటుంబ ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకోవడం వల్లే వందలాది మంది యువకులు పరువు హత్యల కారణంగా మరణిస్తున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.
చిన్నారులపై కొనసాగుతున్న లైంగిక వేధింపులపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆవేదన వ్యక్తం చేశారు. యునిసెఫ్‌తో కలిసి జువెనైల్ జస్టిస్‌పై సుప్రీంకోర్టు కమిటీ నిర్వహించిన పోక్సో చట్టంపై ఢిల్లీలో రెండు రోజుల జాతీయ సదస్సులో శనివారం పాల్గొన్న సందర్భంగా సీజేఐ చంద్రచూడ్ ప్రసంగించారు.
అదనపు ఫీచర్లతో కూడిన సుప్రీంకోర్టు మొబైల్ యాప్ 2.0 సిద్ధంగా ఉందని.. న్యాయ అధికారులు, ప్రభుత్వ విభాగాలు తమ కేసులను ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం ప్రకటించారు.