తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది… లేఖలు, ఫిర్యాదులు, ఆరోపణలు, విమర్శలు.. ఇలా చివరకు విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.. ఈ నేపథ్యంలో కీలక సూచనలు చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. జల వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారానే పరిష్కరించుకోవాలన్నారు సీజేఐ.. తెలుగు రాష్ట్రాల మధ్య కలహాలు వద్దన్న ఆయన.. అంతేకాదు మూడోపక్షం జోక్యం అవాంఛనీయం అన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్ని వివాదంపై విచారణలో భాగంగా…
వలసపాలన అవశేషమైన 124(ఎ) సెక్షన్ రాజద్రోహం కేసులు ఇంకా కొనసాగడం ఏమిటని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనవార్తగా ప్రచారమవుతున్నది. గాంధీ తిలక్ వంటి జాతీయ నాయకులను శిక్షించేందుకు బ్రిటిష్ వారు తెచ్చిన ఈ సెక్షన్లు 75ఏళ్ల స్వాతంత్రం తర్వాతా దేనికని సిజె రమణ మాజీ మేజర్ జనరల్ వోంబట్కరే దాని రద్దుకోసం దాఖలు చేసిన కేసు సందర్భంగా ప్రశ్నించారు. 1890నాటి రాజద్రోహచట్టం, 1910లో బ్రిటిష్‌పత్రికా చట్టం 1917లో రౌలట్ చట్టం,1928 ప్రజాభద్రతా చట్టం…
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం కారణంగా వాయిదా పడ్డ పరీక్షలను తిరిగి నిర్వహిచేందుకే సిద్ధమవుతోంది సీబీఎస్ఈ బోర్డు.. అయితే పరీక్షల పాటర్న్ కరోనా సంక్షోభం నేపధ్యంలో కాస్త మారనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి రెండు విధివిధానాల్ని పరిశీలిస్తున్నట్టుగా సమాచారం.. అయితే, సీబీఎస్ఈ పరీక్షలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు 297 మంది విద్యార్థులు… పరీక్షలు భౌతికంగా నిర్వహించాలని తీసుకున్ననిర్ణయాన్ని క్వాష్ చేయాలని విజ్ఞప్తి చేశారు.. విద్యార్థుల మూల్యాంకనంకి గతేడాది అవలంభించిన ప్రత్యామ్నాయ విధానాలను అవలంభించాలి.. ఈ…