Biswa Bhusan Harichandan: రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ తొమ్మిదవ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరుప్ కుమార్ గోస్వామి హరిచందన్‌తో ప్రమాణం చేయించారు. గవర్నర్ హరిచందన్ హిందీలో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి భూపేష్ భఘేల్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రవీంద్ర చౌబే, ఛత్తీస్‌గఢ్ బీజేపీ అధ్యక్షుడు అరుణ్ సావో, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత నారాయణ్ చందేల్‌తో పాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
బిశ్వభూషణ్ హరిచందన్ 2019 జులై 24 నుంచి 2023 ఫిబ్రవరి 22 వరకు ఆంధ్రప్రదేశ్ 23వ గవర్నర్‌గా పనిచేశారు. నిన్న మణిపూర్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అనుసూయా ఉయికే తర్వాత ఆయన ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. సుప్రసిద్ధ రామజన్మభూమి కేసు తీర్పును వెలువరించిన ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తులలో ఒకరైన సుప్రీంకోర్టు మాజీ రిటైర్డ్ న్యాయమూర్తి సయ్యద్ అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. హరిచందన్ అనంతరం ఆయన గవర్నర్‌గా నియమితులయ్యారు.
Read Also: Clash With Cops: అమృత్‌సర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. తుపాకులు, కత్తులతో పోలీస్‌స్టేషన్ ముట్టడి
గవర్నర్ హరిచందన్ ఒడిశాలో 3 ఆగస్ట్ 1934న జన్మించారు. అతని తండ్రి పరశురామ్ హరిచందన్ ఒడిశాలోని అతిపెద్ద సాహిత్యవేత్తలలో ఒకరు. హరిచందన్ ఒడిశా అసెంబ్లీకి భువనేశ్వర్, చిలికా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించి 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. 1971లో జనసంఘ్‌లో చేరడంతో ఆయన రాజకీయ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. 1977లో జనతాపార్టీ స్థాపనకు ముందు జన్‌సంఘ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఒడిశాలో బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ప్రారంభ రోజులలో పార్టీ అభివృద్ధి కోసం పనిచేశారు. ఆయన కవి, సాహితీవేత్తగా 2021లో కళింగ రత్న అవార్డును కూడా గెలుచుకున్నారు.