Police Station: ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం ఓ పోలీసు అధికారి శవమై కనిపించాడు. మృతుడిని నరేంద్ర సింగ్ పరిహార్‌గా గుర్తించారు. ఉదయం బాంగో పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసు బ్యారక్ నుంచి అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI) నరేంద్ర సింగ్ పరిహార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారని అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) అభిషేక్ వర్మ తెలిపారు.
Read Also: USA: క్రూయిజ్ షిప్‌లో ప్రయాణిస్తున్నవారికి మిస్టరీ వ్యాధి.. 300 మందికి పైగా అనారోగ్యం..
ఆ అధికారి జిల్లాలోని బాంగో పోలీస్ స్టేషన్‌లో నియమించబడ్డారని, పోలీసు బ్యారక్‌లో నివసిస్తున్నారని ఏఎస్పీ అభిషేక్ వెల్లడించారు. ప్రాథమిక పోలీసు దర్యాప్తులో అతని శరీరంపై గాయాలు కనిపించాయని ఏఎస్పీ వివరించారు. అయితే, అతని శరీరంపై ఉన్న గాయం గుర్తులు, సందర్భోచిత సాక్ష్యాలను బట్టి అతడు హత్యకు గురైనట్లు తెలుస్తోందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు, ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్ నిపుణులతో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టినట్లు ఏఎస్పీ వర్మ తెలిపారు. శవపరీక్ష నివేదిక వచ్చిన తర్వాత కేసులో మరింత స్పష్టత, మరణానికి ఖచ్చితమైన కారణం తెలుస్తుందని అధికారి తెలిపారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.