పుష్ప-2 సినిమా కారణంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియా వైడ్ సినిమా హాళ్లు అన్నీ హౌస్ ఫుల్ రన్ అవుతున్నాయి.ఈ సినిమా వసూళ్లు చూసి దొంగలు ఓ ప్రాంతంలో కుట్ర పన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలోని ముక్తా మల్టీప్లెక్స్ సినిమా హాల్‌లో దుండగులు రూ.1.34 లక్షలు దోచుకెళ్లారు. అసలు విషయం ఏమిటంటే ఈ థియేటర్లో పుష్ప 2 ప్రదర్శితమవుతోంది. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఇద్దరు అగంతకులు సినిమా హాల్లోకి ప్రవేశించారు. ముందుగా సెక్యూరిటీ గార్డును…