చెన్నైలో ఆన్లైన్ గేమ్ వ్యసనానికి సంబంధించిన కొత్త కేసు వెలుగులోకి వచ్చింది. 26 ఏళ్ల యువకుడు తన తల్లి క్యాన్సర్ చికిత్స కోసం వచ్చిన డబ్బుతో ఆన్లైన్లో రమ్మీ ఆడాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతడిని తీవ్రంగా మందలించారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు టెర్రస్‌పై ఉన్న టీవీ కేబుల్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కడలూరు జిల్లా సేతియాతోపు పక్కన ఉన్న మంగళం ప్రాంతానికి చెందిన మలర్ సెల్వం.. అదే ఏరియాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కెమిస్ట్రీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో పాఠశాలలో ప్లస్–2 చదువుతున్న విద్యార్థిని లైంగికంగా వేధించేవాడని సమాచారం.
మనోజ్- మోహన్ బాబు గొడవలో వెలుగులోకి ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. చెన్నై లో ఉన్న ఓ టాయ్స్ కంపెనీని కొనుగోలు చేసేందుకు మౌనిక- మనోజ్ దంపతులు సిద్ధమయ్యారు. మనోజ్ కి వ్యాపారం చేయడం తెలియదని మోహన్ బాబు కంపెనీ కొనుగోలుకు నిరాకరించారు. ఇప్పటికే పలు వ్యసనాలకు అలవాటు పడ్డారని మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో మౌనిక- మనోజ్ దంపతులను జల్పల్లి ఇంట్లోనే ఉండాలని చెప్పారు. వ్యాపారంతో పాటు రాజకీయాల్లోకి వెళ్లాలనే యోచనలో…
తమిళనాడు రాష్ట్రంలో ఫెంగల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. భారీ వర్షాలతో విల్లుపురం జిల్లాలో వరద బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనను నిలిపి వేయాలని వారితో చర్చలు జరిపేందుకు వెళ్లిన సమయంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పొన్ముడి సహా ఇతర డీఎంకే నేతలపై పెద్ద ఎత్తున బురదను చల్లారు.
తమిళనాడులో రాష్ట్రంలో ఫెంగల్ తుఫాన్ ఘోర విషాదం నింపింది. భారీ వర్షాల ధాటికి 18 మంది మృతి చెందారు. తుఫాన్ వల్ల కురిసిన భారీ వర్షాలకు తిరువన్నమలైలో కొండ చరియలు విరిగిపడ్డాయి పలు ఇళ్లపై.. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు.
పుదుచ్చేరి, తమిళనాడులోని స్కూల్స్, కాలేజీలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చెన్నై, కడలూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు, మైలాడుతురై జిల్లాల్లో ఈ రోజు మూతపడ్డాయి.
తమిళ నటి కస్తూరికి చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు పుఝల్ సెంట్రల్ జైలుకు కస్తూరిని తరలించారు. నిన్న(శనివారం) రాత్రి హైదరాబాద్‌లో కస్తూరిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
తిరునెల్వేలి-చెన్నై మధ్య నడుస్తున్న వందేభారత్ రైలులో ఆహారంగా వడ్డించిన సాంబార్లో మూడు కీటకాలు కనిపించాయి. వాటిని కనుగొన్న ప్రయాణిస్తున్న మురుగన్ అనే ప్రయాణికుడు ఫుడ్ ప్రొవైడర్‌కు ఫోన్ చేశాడు. తన చేతితో రెండు పురుగులను తొలగించగా.. మిగిలిన పురుగును మురుగన్ తన చేత్తో పట్టుకుని చూపించాడు.
Smuggling Dolls: చెన్నై నగరంలో స్మగ్లింగ్ సంబంధించిన ఓ విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనలో సుమారు 7 కోట్లు పైగా విలువ చేసే ఏనుగు దంతాలతో తయారు చేసిన 4 ఏనుగు బొమ్మలను స్వాదినం చేసుకున్నారు చెన్నై అటవీశాఖ అధికారులు. నగరంలోని విల్లుపురం కొత్త బస్ స్టేషన్ సమీపంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఈ బొమ్మలకు సంబంధించి బేరమాడి విక్రయిస్తుండగా అటవీశాఖ అధికారులు, విల్లుపురం పోలిసు అధికారులు అరెస్టు చేసారు. ఈ ఘటనలో చెన్నై, తిరుచ్చి,…