Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో బెంగళూర్ వెళ్లాల్సిన కనీసం 10 విమానాలను చెన్నైకి మళ్లించినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. బెంగళూర్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు విమాన సేవలపై ప్రభావం చూపిస్తున్నాయని ఇండిగో ఎక్స్‌లో పేర్కొంది. తమ బృందాలు వాతావరణాన్ని గమనిస్తున్నాయని, పరిస్థితులు మెరుగైన తర్వాత సకాలంలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభిస్తామని చెప్పింది.
CM Revanth Reddy: నియోజకవర్గాల పునర్విభజనతో నష్ట పోనున్న రాష్ట్రాల గళాన్ని వినిపించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలో రేపు (మార్చ్ 22) నిర్వహించనున్న సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. చెన్నైలోని గిండీలో గల ఐటీసీ చోళ హోటల్లో ఉదయం 10. 30 గంటలకు సదస్సు ప్రారంభం కానుంది.
తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తూత్తుకుడి థర్మల్ పవర్ ప్లాంట్ లో భారీగా మంటలు చెలరేగాయి. నిన్న రాత్రి ఒకటి, రెండు యూనిట్ల కూలింగ్ రూమ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో గదిలోని విద్యుత్ తీగలు కాలిపోయి ధ్వంసమయ్యాయి. అలర్ట్ అయిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. మంటలను ఆర్పేందుకు18 కు పైగా ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. Also Read:Court : కోర్ట్ తీర్పుకు కలెక్షన్స్ ప్రవాహం.. 2 రోజులకు ఎంతంటే..?…
తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. ఓ వైద్యుడి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Madras University: మద్రాస్ యూనివర్సిటీ వివాదంలో చిక్కుకుంది. ‘‘భారతదేశంలో క్రైస్తవ మతాన్ని ఎలా వ్యాప్తి చేయాలి’’ మరియు ‘‘ఈ మార్గం మనకు ఎందుకు అవసరం’’ అనే శీర్షికతో ఒక లెక్చర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అయితే, దీనిపై సోషల్ మీడియాపై విస్తృతంగా విమర్శలు వచ్చాయి. దీంతో యూనివర్సిటీ ఈ లెక్చర్‌ని రద్దు చేసింది. ప్రాచీన చరిత్ర మరియు పురావస్తు శాస్త్ర విభాగం సుబ్రమణ్య అయ్యర్ ఎండోమెంట్ లెక్చర్ సిరీస్ కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్లాన్ చేశారు.
తమిళనాడులో దారుణం జరిగింది. అన్లైన్ రమ్మీ ఆటకు ఓ కుటుంబం బలి అయింది. భార్య మోహన ప్రియా, ఇద్దరు చిన్నారులు ప్రణీత, రాజీ ఇంట్లో ఆత్మహత్య చేసుకోగా.. కరూర్ సమీపంలోని పశుపతిపాళయం దగ్గర రైలు కిందపడి ప్రేమ్‌రాజ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
చెన్నైలో ఘోరం చోటుచేసుకుంది. బాణసంచా కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవదహనమయ్యారు. ఈ ఘటన ధర్మపురి జిల్లాలో చోటుచేసుకుంది. టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పేలుడు ధాటికి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, ఇద్దరు గాయాలపాలయ్యారు. మృతిచెందిన వారిని మహిళా కార్మికులు తిరుమలర్, తిరుమంజు, చెన్‌పాగం గా గుర్తించారు. Also Read:Skoda Kodiaq: పవర్…
విమాన ప్రయాణానికి ధీటుగా హైదరాబాద్-బెంగళూరు, చెన్నైకి హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకోసం కేంద్రం ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
Chennai: కన్యాకుమారి జిల్లా విల్లుకురి గ్రామంలో ఓ దారుణ సంఘటన చోటుచేసుకుంది. సౌదీ అరేబియాలో భవన నిర్మాణ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న బెంజమిన్ అనే వ్యక్తి తన భార్య సునీత మోసానికి బలయ్యాడు. ఇంటిని అమ్మి అ డబ్బుతో ప్రియుడితో పారిపోయింది భార్య. భార్య సునీత తన భర్త బెంజమిన్‌ను డబ్బు అవసరం అంటూ ఇంటిని అమ్మెందుకు ఒప్పించింది. ఇంటిని అమ్మిన తర్వాత వచ్చిన రూ.33 లక్షలను తీసుకొని ప్రియుడు సైజుతో కలిసి సునీత పరారైంది.…
Crime: తన ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికి ఇంటిని వదిలేసి వచ్చిన 13 ఏళ్ల బాలికపై ఓ ట్రాఫిక్ పోలీస్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో చెన్నైలో జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 16 ఏళ్ల బాలుడు కూడా తనని పెళ్లి చేసుకుంటానని అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక చెప్పింది. జనవరి 25న, బాలిక తల్లి మైలాపూర్ ఆల్ ఉమెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ రోజు నుంచి తన కుమార్తె కనిపించడం లేదని చెప్పింది.