Chennai Rains Latest Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దేశంలోని పలుచోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గత మూడు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు తమిళనాడు రాజధాని చెన్నై నగరం చిగురుటాకులా వణికిపోతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో.. ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు ధనవంతులు, ఐటీ జాబర్స్ కొందరు కుటుంబాలతో కలిసి విలాసవంతమైన హోటళ్లకు వెళుతున్నారు. చెన్నై నగరంలో గతేడాది డిసెంబరులో భారీ వర్షాలు కురవడంతో…
Weather Update: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాలకు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేయగా.. ప్రకాశం, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ఆదేశాలు ఇచ్చారు.
Tamil Nadu Rains: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో 10జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. చెన్నై సహా మరో ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు ఇచ్చింది.
తమిళనాడు రాష్ట్రంలో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. మైసూర్- దర్భంగా భాగమతి ఎక్స్ ప్రెస్ చెన్నై సమీపంలోని తిరువళ్లూరు జిల్లాలోని కవరైపెట్లై రైల్వే ష్టేషన్ దగ్గర గూడ్స్ రైలును ఢీ కొట్టింది. రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే 18 రైళ్లను క్యాన్సిల్ చేసింది.
చెన్నైలో రైలు ప్రమాదం జరిగింది. తిరువళ్ళూరు జిల్లా కవారిపేట్ రైల్వే స్టేషన్ సమీపంలో నిలబడి ఉన్న గూడ్స్రైలును ఆంధ్రప్రదేశ్కు వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో పలుపురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఎక్స్ప్రెస్ రైలులోని రెండు కోచ్లు అగ్నికి ఆహుతైనట్లు సమాచారం తెలుస్తోంది.
Chennai Air Show: తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో గల మెరీనా బీచ్ లో నిర్వహించిన ఎయిర్ షోలో విషాద ఘటన చోటు చేసుకుంది. తొక్కిసలాట జరగడంతో ఐదుగురు మరణించాగా.. డిహైడ్రేషన్ కారణంగా 260 మంది స్పృహ కోల్పోయి ఆసుపత్రిలో చేరారు.
చెన్నైలోని మెరీనా బీచ్ దగ్గర ఎయిర్ షోలో తొక్కిసలాట జరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఎయిర్ షో చూసేందుకు జనం పోటెత్తారు. దీంతో.. మెరీనా బీచ్ మొత్తం జనసంద్రంగా మారింది. బీచ్ కు వచ్చే రోడ్లు, మెట్రో రైళ్లు కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలోనే మెరీనా బీచ్ రైల్వే స్టేషన్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
తమిళనాడులోని ఎంకే స్టాలిన్ ప్రభుత్వ మంత్రివర్గంలో ఈరోజు భారీ మార్పు చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
దక్షిణ కొరియా సంస్థ శాంసంగ్కు చెందిన తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ ప్లాంట్లో గత 17 రోజులుగా ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. సమ్మె చేస్తున్న ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తామని కంపెనీ హెచ్చరించింది.