Tamilnadu : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి విషయం క్షణాల్లో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా కొందరికి ఉపకారి కాగా మరికొందరి అపకారిగా మారుతోంది. కొందరు సోషల్ మీడియా కారణంగా ప్రాణాలు పొగొట్టుకున్న ఘటనలు కోకొల్లలు.
తమిళనాడులోని చెన్నైలో దారుణం జరిగింది. రెండు రోట్వీలర్స్.. ఐదేళ్ల చిన్నారిపై దాడికి తెగబడ్డాయి. దీంతో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. హుటాహుటినా తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు..ఈ పొలిటికల్ థ్రిల్లర్ అప్పుడెప్పుడో 2021లో లాంఛ్ అయింది. అప్పటి నుంచి ఈ సినిమాను శంకర్ చెక్కుతూనే ఉన్నారు. మూడేళ్లు గడిచిపోయినా ఇప్పటికీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించలేదు.. ఇప్పటికి చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుందని గత కొన్ని రోజులుగా మేకర్స్ చెబుతున్నారు.. సాంగ్ తర్వాత మరో అప్డేట్ ను ప్రకటించలేదు.. తాజాగా రామ్ చరణ్ చైన్నైకి వెళ్లినట్లు తెలుస్తుంది. హైదరాబాద్లోని రాజీవ్…
ఓ వ్యక్తి తన భార్యను ఫ్లై ఓవర్పై బహిరంగంగా కొడుతూ తోసేసుందుకు ప్రయత్నం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది. భార్యను కొడుతున్న వీడియో వైరల్ కావడంతో.. నిందితుడు భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు రోషన్ గా గుర్తించారు. ఆ వీడియోలో చెన్నైలోని కోయంబేడు ఫ్లై ఓవర్పై రోషన్ తన భార్యపై దాడి చేస్తున్నట్లు స్పష్టంగా చూడవచ్చు. అయితే.. ఈ వీడియోను ఫ్లై ఓవర్పై ఉన్న…
దివంగత కోలీవుడ్ కమెడియన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు తెలుగు ప్రేక్షకులకి. పక్క కామెడీ టైమింగ్ తో తనదైన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు దివంగత నటుడు వివేక్. ఈయన తమిళంలో అనేక సినిమాల్లో నటించినప్పటికీ తెలుగులో కూడా ఆయన చేసిన సినిమాలు వచ్చాయి. వివేక్ 2021 లో గుండెపోటు కారణంగా మృతి చెందారు. ఈయన మృతి ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పవచ్చు. అనేక సినిమాలలో ఆయన తన కామెడీ టైమింగ్ తో ప్రజలను…
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి గుండె ఆపరేషన్ జరిగింది. చెన్నైలోని అపోలో ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా సర్జరీ నిర్వహించారు. గురువారం చెన్నై అపోలో డాక్టర్లు కుమారస్వామికి నాన్-సర్జికల్ వైద్యం చేశారు.
Women Employment: ఇటీవల కాలంలో మహిళ ఉపాధి ధోరణలు పెరుగుతున్నాయి. ప్రతీ రంగంలో వారి ప్రాతినిధ్యం కనిపిస్తోంది. ముఖ్యంగా సర్వీస్ సెక్టార్లో వీరికి మంచి ఉపాధి లభిస్తోంది. ఇదిలా ఉంటే మహిళలకు ఉపాధి కల్పించే విషయంలో హైదరాబాద్ దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే మహిళా శ్రామిక శక్తికి భాగ్యనగరం గమ్యస్థానంగా నిలుస్తోంది. పూణే, చెన్నై నగరాలు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సుందరరాజన్ బీజేపీలో చేరారు. బుధవారం చెన్నైలో ఆమె కమలం పార్టీలో చేరారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సమక్షంలో తమిళిసై పువ్వు పార్టీలో చేరారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో మాజీ గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ప్రజలను వదిలేసి వెళ్తునందుకు బాధగా ఉంది.. కానీ తప్పడం లేదన్నారు. తెలంగాణ ప్రజలందరు నా అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్ళు అని పేర్కొన్నారు. ఎప్పుడు తెలంగాణ ప్రజలను మరువను.. అందరితో కలుస్తూ ఉంటానని తెలిపారు. మరోవైపు.. తమిళనాడులో ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆమో దాటవేస్తూ వెళ్ళిపోయారు.