Chennai: తమిళనాడులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని నందిని హత్య దేశవ్యాప్తంగా సంచలం సృష్టించింది. నందిని కోసం ట్రాన్స్‌జెండర్‌గా మారిన వ్యక్తి వెట్రిమారన్ ఈ హత్యకు పాల్పడ్డాడు. చెన్నై సమీపంలోని ధాలంపూర్ పొన్నార్ గ్రామం పక్కన ఉన్న వేదగిరి నగర్ లో అత్యంత దారుణంగా హత్య చేశాడు. యువతి చేతుల్ని కట్టేసి, పెట్రోల్ పోసి నిప్పటించారు. తీవ్రగాయాల పాలైన నందిని స్థానికులు గమనించి దళంపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి తరలించి, చికిత్స చేస్తున్న క్రమంలో నందిని మరణించింది.
దుబాయ్లో ఐపీఎల్ 2024 మినీ వేలం జరుగుతోంది. ఈ ఆక్షన్లో స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు కోట్లు కుమ్మరించారు. ఈ క్రమంలో.. చెన్నై సూపర్ కింగ్స్ యాజమన్యం కివీస్ స్టార్ ప్లేయర్లను తమ జట్టులోకి తీసుకుంది. వేలంపాటలో న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్‌పై కోట్ల రూపాయల వర్షం కురిసింది. ఈ క్రమంలో చివరకు చెన్నై సూపర్ కింగ్స్ డారిల్ మిచెల్‌ను 14 కోట్లు వెచ్చించి అతన్ని కొనుగోలు చేసింది. అతని బేస్ ధర రూ. 1…
Rain Alert: తమిళనాడు రాష్ట్రం వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే మిచౌంగ్ తుఫాన్ ధాటికి చెన్నై సముద్రాన్ని తలపిప్తోంది. ఎక్కడా చూసినా వరద నీరు, బురదమయైంది. భారీ వర్షాల కారణంగా చెన్నైలో ప్రజల జీవితం దెబ్బతింది. డిసెంబర్ 4న కురిసిన భారీ వర్షాల కారణంగా ఇప్పటికే అనేక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. నగర వ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి.
తమిళనాడు రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉత్తర చెన్నైలోని మనాలి సమీపంలోని వైకాడు ప్రాంతంలోని సబ్బు పొడి గోదాములో ఇవాళ ఉదయం భారీ ఎత్తున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన వస్తువులు నష్టపోయాయి.
మిచౌంగ్ తుపాన్ తో చెన్నై అతలాకుతలం అవుతుంది. భారీ వర్షాల ధాటికి నగరంలో వరదలు ముంచెత్తాయి. అంతేకాకుండా.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో జనాలు ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో చెన్నై వాసులకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చేయూత అందిస్తున్నారు. తాజాగా.. క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా చెన్నై వాసులకు మద్దతుగా నిలబడ్డాడు.
మంగళవారం తమిళనాడులోని చెన్నైలో మిచాంగ్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పడవలు, ట్రాక్టర్లను ఉపయోగించారు. మంగళవారం ఉదయం నుండి చెన్నైలోని చాలా ప్రాంతాల్లో వర్షం ప్రభావం తక్కువగానే ఉంది. దీంతో రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను అధికారులు వేగవంతం చేశారు. ఇదిలా ఉంటే.. చెన్నై, ఇతర ప్రాంతాలలో వరదల ధాటికి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది గాయపడగా.. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని…
Cyclone Michaung: మిచాంగ్ తుఫాను సోమవారం (డిసెంబర్ 4) తీవ్ర తుఫానుగా మారింది. ఇది నెల్లూరుకు ఆగ్నేయంగా 80 కి.మీ, చెన్నైకి ఉత్తర-ఈశాన్య దిశలో 120 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
డిసెంబర్ 2న బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను.. డిసెంబర్ 5 అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాన్ని తాకనుంది. దీంతో.. ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరిలలో తుపాను ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అంతేకాకుండా.. గాలులు గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. ఇప్పటికే.. చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా వరదల పరిస్థితి నెలకొనగా.. ఇప్పటి వరకు ముగ్గురు మృతి…