Prostitution racket: స్కూల్ గర్ల్స్‌ని వ్యభిచారంలోకి దింపుతున్న ముఠా అరెస్ట్.. స్నేహితురాలి తల్లే ప్రధాన సూత్రధారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prostitution racket: స్కూల్ విద్యార్థినిలకు డబ్బులు ఆశ చూపుతూ వ్యభిచారంలోకి దింపుతున్న ముఠాను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మహిళతో పాటు ఆమె ఆరుగురు సహచరుల్ని అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి 17-18 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు టీనేజ్ బాలికల్ని పోలీసులు రక్షించారు. పక్కా సమాచారంతో పోలీసులు శనివారం అర్ధరాత్రి ఓ లాడ్జిపై దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన 37 ఏళ్ల నదియా అనే మహిళ చెన్నైలో తన కూతురితో కలిసి చదువుతున్న బాలికల్ని టార్గెట్ చేసింది. వారికి డ్యాన్స్ నేర్పిస్తాననే నెపంతో స్నేహం చేసి బ్యూటీషియన్ కోర్సులు కూడా నిర్వహించేందు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన బాలికలకు వలేసేది.
Read Also: Brain-Eating Amoeba: “మెదడును తినే అమీబా” ఇన్ఫెక్షన్‌తో ఐదేళ్ల బాలిక మృతి..
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
నదియా బాలికలకు రూ. 25,000-30,000 ఇస్తానని చెప్పి వ్యభిచారంలోకి దింపింది. చెన్నైలోనే కాకుండా ఢిల్లీ, కోయంబత్తూర్, హైదరాబాద్‌లోని కస్లమర్ల వద్దకు పంపించేందు. ఇతర నగరాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎలా తల్లిదండ్రులకు సాకులు చెప్పాలనే దానిపై కూడా నదియా బాలికలకు శిక్షణ ఇచ్చేదని పోలీసులు తెలిపారు. నిందితురాలు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌ల ద్వారా క్లయింట్స్‌తో డీల్ కుదుర్చుకునేది. కస్టమర్లలో కొందరు కోయంబత్తూర్, హైదరాబాద్‌కి చెందిన వృద్ధులు కూడా ఉన్నట్లు తేలింది. పాఠశాల బాలికలకు ఎక్కువ చెల్లించేందుకు సిద్ధంగా ఉండటంతో నిందితురాలు వారిని టార్గెట్ చేసింది.
అయితే, కొంత కాలం తర్వాత బాలికను ఈ వ్యభిచార కూపం నుంచి బయటకు రావాలనుకుంటే, వీరి వీడియోలు ఉన్నట్లు, తల్లిదండ్రులకు చెబుతారని నదియా బెదిరించిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో అరెస్టైన వారిలో చెన్నైకి చెందిన యశ్రీ, (43), రామంద్రన్(70), సుమతి(43), రామచంద్ర(42), మాయా ఓలి(29), కోయంబత్తూర్‌కి చెందిన అశోక్ కుమార్(31) ఉన్నారు. ఏడుగురు నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. చైల్డ్ లైన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారులు బాలికలకు కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!