Gold Seized: తమిళనాడులోని చెన్నై, మహరాష్ట్రలోని ముంబయి ఎయిర్ పోర్టుల్లో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. చెన్నైలో 2.1 కోట్ల విలువ చేసే 4.5 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. కౌలాలంపూర్, ముంబాయి ప్రయాణీకుల వద్ద బంగారాన్ని అధికారులు గుర్తించారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఓ కిలాడీ లేడీ వద్ద 1808 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. బంగారు బిస్కట్లను మూడు ఎమర్జెన్సీ లైట్లలో దాచి తరలించే యత్నం చేసింది ఆ కిలాడి లేడీ. ఎమర్జెన్సీ లైట్స్ సాధారణ బరువు కన్నా ఎక్కువ బరువు ఉన్నట్లుగా గుర్తించిన కస్టమ్స్ అధికారులు.. వాటిని క్షుణ్ణంగా పరిశీలించగా బంగారం గుట్టు రట్టయింది. ముంబయి ప్రయాణీకుల వద్ద 2.7 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారు బిస్కట్లకు నల్లని టేప్ చుట్టి స్కానింగ్‌కు చిక్కకుండా కేటుగాళ్లు జాగ్రత్త పడ్డారు. కానీ చెన్నై ఎయిర్ పోర్టులో కస్టమ్స్ బృందం కేటుగాళ్ల ఆట కట్టించింది. హ్యాండ్‌బ్యాగ్‌లో దాచిన 2.7 కేజీల 27 బిస్కట్‌లను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఓ మహిళ తో పాటు ఇద్దరు ప్రయాణీకులపై అక్రమ బంగారం రవాణా కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
లోదుస్తులలో బంగారం దాచి..: ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ ప్రయాణీకుల వద్ద 1.63 కోట్ల విలువ చేసే 3.07 కేజీల బంగారం కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. బంగారాన్ని కరిగించి పేస్టుగా మార్చి.. ప్లాస్టిక్ కవర్స్‌లో కేటుగాళ్లు ప్యాకింగ్ చేశారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా ప్లాస్టిక్ కవర్‌లో ప్యాకింగ్ చేసిన బంగారాన్ని లో దుస్తులలో దాచి తరలించే యత్నం చేశారు. లో దుస్తుల్లో దాచిన బంగారు గుట్టును రట్టు చేసి ఇద్దరు ప్రయాణీకులపై కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.