ఖమ్మం జిల్లా చీమలపాడు అగ్నిప్రమాద బాధితులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురు బాధితులు హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈనేపథ్యంలో ఇవాల (గురువారం) ఉదయం మంత్రి కేటీఆర్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి నిమ్స్‌కు చేరుకుని బాధితులను పరామర్శించారు.